Gemini Pro Free Subscription for Jio users: టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో యూజర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. జియో యూజర్లకు గూగుల్ జెమినీ ప్రో ప్లాన్ ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది. ఈ ప్లాన్‌ను 18 నెలల పాటు ఉచితంగా అందించనున్నట్లు రిలయన్స్ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. దీని విలువ రూ.35,100 ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ తన అనుబంధ సంస్థ రిలయన్స్ ఇంటెలిజెన్స్ లిమిటెడ్ గూగుల్‌తో జట్టుకట్టింది. రిలయన్స్ ఇంటెలిజెన్స్, గూగుల్ కలిసి వినియోగదారులు, వ్యాపారాలు, డెవలపర్ల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సౌకర్యాలను మరింత చేరువ చేసేందుకు ఈ ప్లాన్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ ప్లాన్‌లో గూగుల్ జెమినీ 2.5 ప్రో, నానో బనానా, వీఓ 3.1 మోడల్స్ ద్వారా అద్భుతమైన చిత్రాలు, వీడియోలు సృష్టించడం, నోట్‌బుక్ ఎల్‌ఎం ద్వారా స్టడీ, రీసెర్చ్ చేయడం, 2 టెరాబైట్ క్లౌడ్ స్టోరేజ్ వంటి సౌకర్యాలను ఉచితంగా పొందవచ్చు. జియో యూజర్లు ఈ ఆఫర్‌ను మైజియో యాప్ ద్వారా సులభంగా యాక్టివేట్ చేయవచ్చు. 18–25 ఏళ్ల యూజర్లకు ముందుగా అన్‌లిమిటెడ్ 5జి ప్లాన్లలో ఈ ఆఫర్ అందుబాటులోకి వస్తుంది. అనంతరం, దేశంలోని జియో కస్టమర్లందరికీ ఈ సేవలను విస్తరించనుంది.
పర్‌ప్లెక్సిటీ ప్రోకు ఉచిత సబ్‌స్క్రిప్షన్..
కాగా, అక్టోబర్ 30 నుంచి ఈ ఫ్రీ ప్లాన్ అమల్లోకి రానుంది. తొలుత 18 నుంచి 25 ఏళ్ల వయసున్న కస్టమర్లకు దీన్ని అందుబాటులోకి తీసుకురానుంది. అన్‌లిమిటెడ్ 5జీ ప్లాన్ కలిగిన వారిని మాత్రమే ఈ ప్లాన్‌కు అర్హులుగా పేర్కొంది. తర్వాత దశలవారీగా మిగిలిన యూజర్లకు విస్తరించనుంది. ఈ ప్లాన్‌లో భాగంగా జెమిని 2.5 ప్రో మోడల్, 2 జీబీ క్లౌడ్ స్టోరేజీ, వియో 3.1 వీడియో జనరేటర్, నానో బనానా ఇమేజ్ జనరేషన్ వంటి ఫీచర్ల లభించనున్నాయి. వీటితో పాటు నోట్‌బుక్ ఎల్‌ఎం, జెమిని కోడ్ అసిస్ట్, జీమెయిల్, డాక్స్‌లో జెమిని సేవలలు అందుబాటులోకి రానున్నాయి. మై జియో యాప్‌లో ‘క్లెయిమ్ నౌ’ బ్యానర్ క్లిక్ చేసి ఈ ప్లాన్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. ఒకవేళ జెమిని ప్రో సబ్‌స్క్రైబర్లుగా ఉన్న వారు ప్లాన్ గడువు తీరిన తర్వాత జియో అందించే గూగుల్ ఏఐ ప్రోకు మారొచ్చు. మరో టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ కూడా తన యూజర్లకు ఇదే తరహా ఆఫర్‌ను అందిస్తోంది. పర్‌ప్లెక్సిటీ ఏఐ ప్రో సబ్‌స్క్రిప్షన్‌ను ఏడాది పాటు ఉచితంగా ఇస్తోంది. ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్, బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లు సంవత్సరం పాటు పర్‌ప్లెక్సిటీ ప్రో సేవలను వినియోగించుకునే అవకాశం కల్పిస్తోంది.


