Sunday, November 16, 2025
Homeబిజినెస్Nissan Magnite 5 Star Safety: సేఫ్టీలో నిస్సాన్‌ మాగ్నైట్‌కి 5 స్టార్‌ రేటింగ్‌..

Nissan Magnite 5 Star Safety: సేఫ్టీలో నిస్సాన్‌ మాగ్నైట్‌కి 5 స్టార్‌ రేటింగ్‌..

Nissan Magnite NCAP Safety Rating: కారు కొనేముందు జనాలు సేఫ్టీకి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు. దీంతో కారు తయారీ కంపెనీలు సేఫ్టీ ఫీచర్లపై ఎక్కువ దృష్టి సారిస్తున్నాయి. ప్రతి కంపెనీ తమ కొత్త ఉత్పత్తులను మంచి సేఫ్టీ ఫీచర్లతో తీసుకువస్తున్నాయి. తాజాగా భారతీయ మార్కెట్‌లో మంచి మార్కెట్‌ని కలిగి ఉన్న నిస్సాన్ మాగ్నైట్‌ సైతం సేఫ్టీలో 5 స్టార్‌ రేటింగ్‌ని సాధించింది. ఇటీవల గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్‌లో ఈ కారు ఈ రేటింగ్‌ని పొందింది. పెద్దల సేఫ్టీలో 5 స్టార్, పిల్లల సేఫ్టీలో 3 స్టార్‌ రేటింగ్‌ని సాధించింది. ఈ కొత్త వెర్షన్ మాగ్నైట్‌ ఎస్‌యూవీని దక్షిణాఫ్రికా, భారతీయ మార్కెట్‌లో ప్రవేశపెట్టారు. దక్షిణాఫ్రికాకు చెందిన ఎస్‌యూవీని గ్లోబల్ ఎన్‌సీఏపీలో టెస్ట్‌ చేశారు. ఈ కారు 5 స్టార్‌ సేఫ్టీ సాధించడానికి గల టాప్‌ 5 వివరాలు ఇక్కడ చూడండి.

- Advertisement -

6 ఎయిర్‌బ్యాగ్స్‌: మాగ్నైట్ తాజా వెర్షన్‌లో ఆరు ఎయిర్ బ్యాగ్స్ కలవు. ఇవి సైడ్-ఇంపాక్ట్‌ని సైతం కవర్ చేస్తాయి. ఇంతకు ముందు కేవలం రెండు ఎయిర్ బ్యాగ్స్‌ మాత్రమే ఉండేవి. 5 స్టార్‌ రేటింగ్‌ రావడంలో ఇవి కీలకపాత్ర పోషించాయి.

ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్సీ) & వెహికల్ డైనమిక్ కంట్రోల్ (వీడీసీ): ప్రస్తుతం అందుబాటులో ఉన్న వేరియంట్ ESP/VDCని కలిగి ఉన్నాయి. ఇది అత్యవసర సమయాల్లో అలాగే కారు జారిపోయే పరిస్థితి ఉన్న ఉపరితల స్థలాల్లోనూ చక్రాలకు బ్రేకింగ్‌ సపోర్ట్‌ని అందిస్తుంది. అంతే కాకుండా స్కిడ్‌ అవ్వకుండా ఉండేలా సహాయపడుతుంది.

ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (TCS), బ్రేక్ అసిస్ట్ & హిల్ స్టార్ట్ అసిస్ట్ (HSA): రోడ్డుపై స్పీడ్‌గా వెళ్లే సమయంలో ట్రాక్షన్‌ కంట్రోల్‌ మంచి గ్రిప్‌ని అందిస్తుంది. బ్రేక్ అసిస్ట్ (HBA/BA) అత్యవసర పరిస్థితుల్లో బ్రేకింగ్ ప్రెజర్‌ని కంట్రోల్‌లో ఉంచుతుంది. దీంతోపాటు హిల్ స్టార్ట్ అసిస్ట్ కొండ ప్రాంతాల్లో పైకి వెళ్లేటప్పుడు వాహనం వెనుక్కి రాకుండా చేస్తుంది.

టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), సీట్ బెల్ట్ అలర్ట్స్‌: TMPS ఎప్పటికప్పుడూ టైర్ ప్రెజర్‌ని పర్యవేక్షిస్తూ డ్రైవర్‌ని అప్రమత్తం చేస్తుంది. టైర్ సంబంధిత సమస్యలను నివారించడంలో ఇది సహాయపడటంతో పాటు మంచి డ్రైవింగ్ స్టెబిలిటీని అందిస్తుంది. ఫ్రంట్-సీట్ బెల్ట్ రిమైండర్ సిస్టమ్స్‌, డ్రైవింగ్ ప్రారంభానికి ముందే ప్రయాణీకులను అలర్ట్‌ చేస్తుంది. ఇది అన్ని మోడళ్లలో స్టాండర్డ్‌గా అందించబడింది.

360 ఎరౌండ్ వ్యూ కెమెరా & ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్లు: టాప్‌-స్పెక్ వేరియంట్లలో 360-డిగ్రీల కెమెరా (ఎరౌండ్-వ్యూ మానిటర్) వ్యూని అందిస్తుంది. ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్‌ కూడా టాప్ ట్రిమ్‌లో లభిస్తుంది. ఇది పిల్లల సేఫ్టీని మెరుగుపరచడంతో పాటు కారు సీట్లను సురక్షితంగా చేస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad