SAP: ప్రముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఎస్ఏపీ(SAP), భారతదేశంలో తన ఆర్&డీ సామర్థ్యాన్ని విస్తరిస్తుంది. బెంగళూరులోని దేవనహళ్లి ప్రాంతంలో రెండవ పెద్ద క్యాంపస్‌ను ప్రారంభించింది. ఈ క్యాంపస్ ఎస్ఏపీ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్&డీ కేంద్రంగా రూపుదిద్దుకుంది.
ఈ ప్రాజెక్ట్‌కు ఎస్ఏపీ లాబ్స్ ఇండియా దాదాపు 194 మిలియన్ డాలర్లతో (రూ.1,800 కోట్లు) భారీ పెట్టుబడి పెట్టింది. ఈ క్యాంపస్ 41 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది. మొదటి దశలో 27 ఎకరాలలో 3,200 ఉద్యోగులకు ఆతిథ్యం ఇస్తోంది. భవిష్యత్తులో ఇది 15,000 ఉద్యోగులకు ఆశ్రయం ఇవ్వగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
Read more: https://teluguprabha.net/business/upi-charges-indian-government-revenue-secretary/
ఈ క్యాంపస్‌లో ఇండియా సెకండ్ ఎస్ఏపీ ఎక్స్పీరియన్స్ సెంటర్, ఏఐ ఆధారిత స్వయంచాలకంగా పనిచేసే స్మార్ట్ ఎనర్జీ మేనేజ్‌మెంట్, వర్షజల సమీకరణ వంటి పర్యావరణ అనుకూల సదుపాయాలు ఉన్నాయి. అంతేకాదు, ఇది టెక్ ఉత్పత్తుల అభివృద్ధి, వినూత్న ఆవిష్కరణలకు కేంద్రంగా నిలవనుంది.
ఎస్ఏపీ కొత్త క్యాంపస్‌లో ప్రత్యేకంగా సులభ ప్రవేశ సదుపాయాలు, లాక్టేషన్ రూములు, జెండర్ న్యూట్రల్ టాయిలెట్లు, నాప్ పాడ్లు, సెన్సరీ రూములు, చైల్డ్ కేర్ కేంద్రాలు వంటి సామాజిక బాధ్యతలకు సంబంధించిన ఏర్పాట్లు ఉన్నాయి. ఇది ఉద్యోగుల మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు దోహదపడుతుంది.
ఎస్ఏపీ లాబ్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సింధు గంగాధరన్ ఈ క్యాంపస్‌ను ఒక కో-ఇన్నోవేషన్ హబ్ గా అభివర్ణిస్తూ, ఇది భారతదేశంలోని వినియోగదారులు, విద్యాసంస్థలు, స్టార్టప్ లతో భాగస్వామ్యంగా కొత్త ఆవిష్కరణల కోసం ఉపయోగపడుతుందని అన్నారు.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ.. భారతదేశం ప్రపంచ సాంకేతిక శక్తి కేంద్రంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది మరియు ఆవిష్కరణలను స్వీకరించడమే కాకుండా, దానిని చురుకుగా నిర్మిస్తోంది. SAP ల్యాబ్స్ ఇండియా యొక్క కొత్త క్యాంపస్ బలమైన సాక్ష్యంగా నిలుస్తుందని అన్నారు.


