Notification in SBI with out exam: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ వెల్లడించింది. వివిధ బ్రాంచుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 10 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా.. కేవలం విద్యార్హతలు, ఇంటర్వ్యూ ఆధారంగా భర్తీ చేయనున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు అక్టోబర్ 28 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల సంఖ్య: మొత్తం 10 పోస్టులు. ఇందులో డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, మేనేజర్ వంటి పోస్టులు సైతం ఉన్నాయి.
విద్యార్హతలు: ఆసక్తిగల అభ్యర్థులు సంబంధిత విభాగంలో పీజీ, ఎంబీఏ, పీజీడీబీఎంలో ఉత్తీర్ణత పొంది ఉండాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా సంబంధిత పని అనుభవం సైతం ఉండాలి.
వయోపరిమితి: డిప్యూటీ మేనేజర్ అభ్యర్ధుల వయోపరిమితి ఆగస్టు 8, 2025వ తేదీ నాటికి 30 ఏళ్లు అలాగే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టులకు 35 నుంచి 45 ఏళ్లుగా ఉండాలి. మేనేజర్ పోస్టులకు మాత్రం 24 నుంచి 36 ఏళ్లు నిండి ఉండాలని ఎస్‌బీఐ పేర్కొంది.
Also Read: https://teluguprabha.net/career-news/upsc-notification-for-various-posts-in-2025/
దరఖాస్తు ఫీజు: దరఖాస్తు సమయంలో జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు రూ.750 చొప్పున ఫీజు చెల్లించవల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు మాత్రం ఎలాంటి ఫీజు లేదు.
ఎంపిక ప్రక్రియ: ఎలాంటి రాత పరీక్ష లేదు. విద్యార్హతలు, అనుభవం మరియు ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక జరుగుతుందని నోటిఫికేషన్‌లో ఎస్‌బీఐ వెల్లడించింది. ఎంపికైన వారికి నెలకు రూ.64,820 నుంచి రూ.1,35,020 వరకు జీతంగా చెల్లిస్తారు.
పోస్టుల వివరాలు:
- మేనేజర్ పోస్టుల సంఖ్య: 6
- డిప్యూటీ మేనేజర్ పోస్టుల సంఖ్య: 3
- అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టుల సంఖ్య: 1


