Siva Shakti Datta: ఆస్కార్ విన్నర్ కీరవాణి ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి శివశక్తి దత్తా మంగళవారం కన్నుమూశారు. దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళికి శివశక్తి దత్తా పెదనాన్న అవుతారు. శివశక్తి దత్తా కుమారులు కీరవాణి, కళ్యాణి మాలిక్ ఇద్దరూ మ్యూజిక్ డైరెక్టర్లుగానే స్థిరపడ్డారు.
జానకిరాముడుతో…
బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుతెచ్చుకున్న శివశక్తి దత్తా జానకిరాముడు మూవీతో స్టోరీ రైటర్‌గా కెరీర్ మొదలుపెట్టారు. ఆ తర్వాత డైరెక్టర్‌గా, లిరిసిస్ట్‌గా ప్రతిభను చాటుకున్నారు. ఎక్కువగా రాజమౌళి సినిమాల్లోనే శివశక్తి దత్తా పాటలు రాశారు.
Also Read – Sukumar ramcharan movie: RC17 – సుకుమార్ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు.. మరో రంగస్థలం కాబోతోందా..?
అర్ధాంగి మూవీతో…
1996లో రిలీజైన అర్ధాంగి మూవీతో డైరెక్టర్‌గా శివశక్తి దత్తా ఎంట్రీ ఇచ్చాడు. సోదరుడు విజయేంద్రప్రసాద్‌తో కలిసి ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. రవళి, ఆనంద్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీ కమర్షియల్‌గా సరైన విజయాన్ని సాధించలేదు. ఆ తర్వాత చంద్రహాస్ అనే సినిమాకు సోలో డైరెక్టర్‌గా శివశక్తి దత్తా వ్యవహరించారు. అర్ధాంగి సినిమా కంటే ముందే శివశక్తి దత్తా దర్శకుడిగా పరిచయం కావాల్సింది. రాజమౌళి హీరోగా ఓ బాలల మూవీని తెరకెక్కించాలని శివశక్తి దత్తా ప్లాన్ చేశారు.
మైథలాజికల్ మూవీ…
మైథలాజికల్ స్టోరీతో తెరకెక్కిన ఈ మూవీకి పిల్లన గ్రోవి అనే టైటిల్‌ను పెట్టారు శివశక్తి దత్తా. ఈ సినిమాకు ఆయనే కథను అందించారు.పిల్లనగ్రోవి సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఆచారాలు, సంప్రదాయాలకు విలువనిచ్చే ఓ బ్రహ్మణ కుటుంబంలో చిన్నారి కృష్ణుడు ఎలా మార్పు తీసుకొచ్చాడన్నదే పిల్లనగ్రోవి మూవీ కథ.
Also Read – Nithiin: నితిన్‌కు అచ్చిరాని ఓల్డ్ టైటిల్స్ సెంటిమెంట్!
కృష్ణుడిగా…
పిల్లనగ్రోవి సినిమాలో చిన్నికృష్ణుడి పాత్రలో రాజమౌళి నటించారు. రాజమౌళి సోదరి, మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్ఎమ్ శ్రీలేఖ కూడా ఈ మూవీలో ఓ చిన్న పాత్రలో కనిపించింది. ఈ సినిమాకు యాక్టర్స్‌తో పాటు టెక్నీషియన్లు చాలా మంది రాజమౌళి ఫ్యామిలీ మెంబర్స్ పనిచేశారు. ఆర్థిక కారణాల వల్ల షూటింగ్ మధ్యలోనే ఈ సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత కొంతకాలానికి ఈ సినిమాను పూర్తిచేసి రిలీజ్ చేయాలని శివశక్తిదత్తా, విజయేంద్రప్రసాద్ అనుకున్నారు. కానీ రాజమౌళి పెద్దవాడు కావడంతో కుదరలేదు. అలా రాజమౌళి కెరీర్‌లో రిలీజ్ కాకుండా మిగిలిపోయిన మూవీగా పిల్లనగ్రోవి నిలిచింది.


