ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan)లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి(Posani Krishna Murali)ని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు నెల రోజుల నుంచి ఆయన జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. విజయవాడ, నరసరావుపేట, రాజంపేట, కర్నూలు జిల్లా జైలులో శిక్ష అనుభవించారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పోసాని అరెస్ట్‌పై ప్రముఖ నటుడు శివాజీ(Shivaji) స్పందించారు. రాజకీయ నాయకుల వ్యక్తిగత జీవితాల జోలికి ఎవరూ వెళ్లకూడదన్నారు. ఒకవేళ పార్టీల ఆదేశాలకు అనుగుణంగా విమర్శించాల్సి వస్తే ఆ వ్యక్తినే విమర్శించాలి కానీ.. వారి కుటుంబసభ్యులను విమర్శించకూడదని సూచించారు. తాను 12 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నానని.. ఏనాడూ ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించలేదని తెలిపారు. పోసాని అదుపుతప్పి మాట్లాడారని.. అందుకు శిక్ష అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. అయితే ఆయన రియలైజ్ అవ్వడానికి ఓ అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.