Allu Arjun: తన మేనమామ, మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఇంటికి కుటుంబ సభ్యులతో కలిసి అల్లు అర్జున్ (Allu Arjun) వెళ్లారు. జైలు నుంచి విడుదలైన తర్వాత తొలిసారి చిరంజీవిని బన్నీ కలుసుకున్నారు. అరెస్ట్, కేసు తదితర పరిణామాల గురించి చిరంజీవికి వివరించినట్లు సమాచారం.
- Advertisement -
అల్లు అర్జున్ అరెస్ట్ అయిన రోజున చిరంజీవి, సురేఖ దంపతులు అల్లు అర్జున్ నివాసానికి చేరుకొని కుటుంబసభ్యులను పరామర్శించిన సంగతి తెలిసిందే. ఇక జైలు నుంచి విడుదలైన తర్వాత శనివారం ఉదయం బన్నీ ఇంటికి వెళ్లిన చిరు సతీమణి సురేఖ ఆయనను పరామర్శించిన విషయం విధితమే. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బన్నీ అరెస్ట్ అయ్యాడని తెలియగానే ఎంతో కంగారు పడ్డామని.. చిరంజీవి కూడా షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని వచ్చారని తెలిపారు.