AR Rahman| ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్(AR Rahman) దంపతులు విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. వారు విడాకులు తీసుకున్న కొద్ది సేపటికే రెహమాన్ అసిస్టెంట్ బాసిస్ట్ మోహిని(Mohini) కూడా ఆమె భర్తకు విడాకులు ఇచ్చింది. దీంతో సోషల్ మీడియాలో పలు వార్తలు షికార్లు చేస్తున్నాయి. మోహిని కోసమే రెహమాన్ తన 29 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికారని వందతులు వస్తున్నాయి. దీంతో ఈ వదంతులపై సైరా బాను తరపు లాయర్ వందనా షా స్పందించారు.
ఈ రెండు జంటల విడాకులకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. పరస్పర అంగీకారంతోనే రెహమాన్ – సైరా దంపతులు విడాకుల నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. వారిద్దరూ విడిపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయని.. వాటిని చెప్పే హక్కు తనకు లేదని స్పష్టం చేశారు.
కాగా ఏఆర్ రెహమాన్, సైరా బాను 1995లో పెళ్లి చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. పెళ్లి జరిగిన 29 ఏళ్ల తర్వాత విడిపోతున్నట్లు ప్రకటించడం అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆశ్చర్యానికి గురయ్యాయి.