Sunday, July 7, 2024
Homeచిత్ర ప్రభBalakrishna : హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలపై డబ్బులు పెట్టాలంటే 100 సార్లు ఆలోచిస్తారు..

Balakrishna : హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలపై డబ్బులు పెట్టాలంటే 100 సార్లు ఆలోచిస్తారు..

- Advertisement -

Balakrishna : ఆహా ఓటీటీలో బాలయ్య హోస్ట్ గా అన్‌స్టాపబుల్‌ షో రెండో సీజన్ కూడా దూసుకుపోతుంది. ఇప్పటికే అయిదు ఎపిసోడ్లు అవ్వగా ఈ సీజన్ లో మరో ఎపిసోడ్ ప్రోమోని తాజాగా రిలీజ్ చేశారు. ఈ సారి అన్‌స్టాపబుల్‌ షోలో ముగ్గురు భామలతో బాలయ్య సందడి చేయనున్నారు. జయసుధ, జయప్రద, రాశిఖన్నాలు అన్‌స్టాపబుల్‌ ఆరో ఎపిసోడ్ కి వచ్చి సందడి చేశారు.

ఈ ముగ్గురి భామలతో బాలయ్య అన్‌స్టాపబుల్‌ లో సందడి చేశాడు. ఈ ఎపిసోడ్ డిసెంబర్ 23న ఆహాలో స్ట్రీమ్ అవ్వనుంది. తాజాగా ఈ ప్రోమోని రిలీజ్ చేశారు. ఈ ఎపిసోడ్ లో బాలయ్య ముగ్గురు భామలతో కలిసి డ్యాన్స్ వేశారు. రాశిఖన్నాని తెగ పొగిడేస్తూ ఆమె స్మైల్ కి పడిపోయాను అంటూ సరదాగా ఆటపట్టించారు. రాశి నటించిన ఊహలు గుసగుసలాడే సినిమాలోని సాంగ్ పాడి అలరించింది. అనంతరం సరదాగా కొన్ని ప్రశ్నలు అడిగాడు.

అలాగే ఈ ముగ్గురి హీరోయిన్స్ ని కొన్ని కాంట్రవర్సీ ప్రశ్నలు కూడా అడిగాడు బాలయ్య. హీరోయిన్ అవ్వాలంటే పరిశ్రమలో కొన్ని కాంప్రమైజ్ లు తప్పవు, హీరోయిన్ సెంట్రిక్ సినిమాలపై డబ్బులు పెట్టడానికి ప్రొడ్యూసర్లు 100 సార్లు ఆలోచిస్తారు లాంటి కాంట్రవర్సీ ప్రశ్నలు అడిగాడు బాలయ్య. అయితే దీనికి ఆ ముగ్గురు భామలు ఏం సమాధానం చెప్పారో తెలియాలంటే ఎపిసోడ్ లో చూడాల్సిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News