Sunday, May 19, 2024
Homeచిత్ర ప్రభCustody: చైతూ మరో యాక్షన్ ప్లాన్.. ఈసారైనా వర్క్ అవుట్ అవుతుందా?

Custody: చైతూ మరో యాక్షన్ ప్లాన్.. ఈసారైనా వర్క్ అవుట్ అవుతుందా?

Custody: అక్కినేని హీరోలంటే రొమాంటిక్ సినిమాలకు పేరు. ఏఎన్ఆర్ దగ్గర నుండి మొదలు పెడితే మనవళ్లు నాగ చైతన్య, అఖిల్ వరకు అందరికీ లవ్ స్టోరీల సినిమాలతో సక్సెస్ కొట్టిన వాళ్ళే. నాగార్జున కెరీర్ తొలి నాళ్ళలో మాస్ హీరోగా ట్రై చేసి మజ్ను సినిమాతో ఫ్యామిలీ లవబుల్ హీరోగా ఫిక్స్ అయ్యాడు. నాగ చైతన్య, అఖిల్ కూడా మొదట మాస్ సినిమాలతో ఎంట్రీ ఇచ్చి ఈ మధ్య లవర్ బాయ్ పాత్రలనే ఎంచుకొని హిట్స్ కొట్టారు.

- Advertisement -

నాగ చైతన్య మాస్ కథలతో ట్రై చేసిన సినిమాలన్నీ దాదాపుగా బోల్తా కొట్టడంతో ఈ మధ్య కాలంలో వాటి జోలికి వెళ్లడం లేదు. యుద్ధం శరణం, సవ్యసాచి తర్వాత దాదాపు అరడజను సినిమాలు లవ్ అండ్ ఫ్యామిలీ సినిమాలే చేశాడు. అయితే, ఇప్పుడు మళ్ళీ మాస్ యాక్షన్ సినిమాతో రాబోతున్నాడు. తమిళ్ స్టార్ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెలుగు, తమిళ బాషలలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

తాజాగా చైతూ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకి ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చెయ్యగా.. ఈ రోజు బర్త్ డే రోజున ఈ సినిమాకి టైటిల్ అనౌన్స్ చేశారు. కస్టడీ అనే ఆసక్తికర టైటిల్ తో పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో చైతూ పోలీస్ గెటప్ లో ఇంటెన్స్ గా కనిపిస్తుండగా తన చుట్టూ ఉన్న పోలీసులు గన్స్ తో అతన్ని చుట్టముట్టడం ఆసక్తిగా కనిపిస్తుంది. మరి ఈ సినిమా అయినా చైతూ యాక్షన్ హీరోను చూస్తుందేమో చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News