Sunday, May 19, 2024
Homeటెక్ ప్లస్Samsung Black Friday Sale : శామ్ సంగ్ బ్లాక్ ఫ్రైడే సేల్‌.. భారీగా త‌గ్గింపు...

Samsung Black Friday Sale : శామ్ సంగ్ బ్లాక్ ఫ్రైడే సేల్‌.. భారీగా త‌గ్గింపు ధ‌ర‌లు

Samsung Black Friday Sale :ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శామ్‌సంగ్ ప్రైడే సేల్ ప్రారంభ తేదీ వ‌చ్చేసింది. న‌వంబ‌ర్ 24 నుంచి ఈ సేల్ ప్రారంభం అవుతుంది. నాలుగు రోజుల పాటు ఈ సేల్ కొన‌సాగ‌నుంది. నవంబ‌ర్ 28 వ‌ర‌కు వినియోగ‌దారులు శామ్‌సంగ్ కంపెనీకి చెందిన స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ట్యాబ్లెట్లు, గెలాక్సీ బ‌డ్స్‌, గెలాక్సీ వాచ్‌ల‌ను త‌క్కువ ధ‌ర‌కే కొనుగోలు చేయ‌వ‌చ్చు.

- Advertisement -

Samsung Galaxy Z Fold 4, Galaxy Z Flip 4, Galaxy S22 వంటి వాటిపై భారీగా త‌గ్గింపు ఉంటుంద‌ని కంపెనీ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. Samsung Galaxy Z Fold 4 12GB RAM + 256GB స్మార్ట్‌ఫోన్ ధ‌ర‌ రూ. 1,54,99కి బదులుగా రూ. 1,44,999కి అందుబాటులో ఉంటుంది. Galaxy S22, Galaxy S22+ మరియు Galaxy S22 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ల ప్రారంభ ధర రూ. 60,000 కంటే తక్కువగా ఉంటుంది. ఈ ఫోన్ల ధ‌ర మామూలు రోజుల్లో రూ.72,999 నుంచి ప్రారంభం అవుతుంది.

పాత ఫోన్ల‌ను ఎక్సేంజ్ చేసుకోవ‌డం ద్వారా కొత్త ఫోన్ల‌పై మ‌రింత త‌గ్గింపు పొంద‌వ‌చ్చు. శామ్‌సంగ్ కంపెనీ యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్ మరియు ఎస్‌బిఐతో భాగ‌స్వామ్యం క‌లిగి ఉంది. ఈ బ్యాంకు కార్డులు ఉప‌యోగించి కొనుగోలు చేస్తే అద‌న‌పు డిస్కౌంట్ ల‌భించ‌నుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News