Monday, December 9, 2024
Homeచిత్ర ప్రభJai Hanuman: 'జై హనుమాన్‌'లో రానా.. శివరాత్రికి 'తమ్ముడు'

Jai Hanuman: ‘జై హనుమాన్‌’లో రానా.. శివరాత్రికి ‘తమ్ముడు’

Jai Hanuman| దర్శకుడు ప్రశాంత్ వర్మ(Prasanth varma) దర్శకత్వం వహిస్తున్న ‘జై హనుమాన్'(Jai Hanuman) మూవీ నుంచి దీపావళి కానుకగా బిగ్ అప్‌డేట్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆంజనేయస్వామి పాత్రను కన్నడ స్టార్ హీరో రిషభ్‌ శెట్టి(Rishab Shetty) పోషిస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. దీంతో సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా మరో సర్‌ప్రైజ్ ఇచ్చాడు ప్రశాంత్ వర్మ. హీరో దగ్గుబాటి రానా(Rana), రిషబ్‌శెట్టితో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. దీనికి ‘జై జై హనుమాన్‌’ అని క్యాప్షన్‌ ఇస్తూ రిషబ్‌శెట్టి, రానా, ప్రశాంత్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ను (PVSU) కోట్‌ చేశారు. ఈ పోస్ట్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

- Advertisement -

ఇక యువ హీరో నితిన్(Nithin) హీరోగా నటిస్తున్న చిత్రం ‘తమ్ముడు’. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘వకీల్ సాబ్’ డైరెక్టర్ శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ తాజాగా ప్రకటించారు. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు కొత్త పోసర్ట్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో నితిన్.. కాగడా చేత్తో పట్టుకుని భుజం మీద పాపను ఎత్తును పరిగెత్తుతూ ఉన్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాన్ హిట్ చిత్రం ‘తమ్మడు’ టైటిల్‌ను ఈ సినిమాకు పెట్టడంతో మూవీపై ఆసక్తి పెరిగింది.

మరో యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Srinivas) హీరోగా నటిస్తున్న చిత్రం టైటిల్‌ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. తమిళంలో సూపర్ హిట్ అయిన చిత్రాన్ని బెల్లంకొండతో దర్శకుడు విజయ్ కనకమేడల రీమేక్ చేస్తున్నారు. ఇందులో నారా రోహిత్, మంచు మనోజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ‘భైరవం’ అనే పేరు ఫిక్స్ చేస్తూ పోస్టర్ విడుదల చేశారు. సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కె.కె రాధామోహన్ ఈ సినిమాను భారీ బడ్జెటపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో దిగ్గజ దర్శకుడు శంకర్ కుమార్తె అదితి శంకర్ హీరోయిన్‌గా పరిచయం కాబోతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News