Wednesday, March 26, 2025
HomeఆటDavid Warner: ‘రాబిన్‌ హుడ్‌’ ఈవెంట్‌లో డేవిడ్‌ వార్నర్‌ డ్యాన్స్‌

David Warner: ‘రాబిన్‌ హుడ్‌’ ఈవెంట్‌లో డేవిడ్‌ వార్నర్‌ డ్యాన్స్‌

నితిన్ హీరోగా తెరకెక్కిన ‘రాబిన్‌హుడ్‌’ (Robinhood) సినిమాలో ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ (David Warner) అతిథి పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో మూవీ యూనిట్ నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు వార్నర్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఈ ఈవెంట్‌లో డ్యాన్స్ వేయడంతో పాటు తెలుగులో మాట్లాడి సందడి చేశాడు. అదిదా సర్‌ప్రైజ్ పాటకు నితిన్, శ్రీలీల, కేతికశర్మలతో కలిసి హుక్ స్టెప్స్ వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

- Advertisement -

ఇక ఈవెంట్‌లో మాట్లాడుతూ.. న‌మ‌స్కారం అని తెలుగులో అభిమానులను ప‌ల‌క‌రించాడు. కొన్నాళ్లుగా త‌న‌పై తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు చూపిన ప్రేమ‌కు హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశాడు. సినీ ఇండ‌స్ట్రీలో వ‌చ్చేందుకు కొంచెం భ‌య‌ప‌డ్డానని.. అయితే రాబిన్ హుడ్ టీమ్ త‌న‌కు ఎంతో స‌పోర్ట్ ఇచ్చింద‌న్నాడు. ఇక దర్శకుడు వెంకీ కుడుముల తెలుగులో ఏదైనా చెప్పమని అడిగగా.. “నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాడు. కాగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మించిన ఈ చిత్రం మార్చి 28న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News