ఈరోజు ఎపిసోడ్‌లో కావ్య ఆఫీస్‌లో వర్క్ చేసుకుంటుంటే స్వప్న డెలివరీ అయ్యి ఆడపిల్ల పుట్టిన సంగతి ఫోన్ చేసి చెప్తారు. ఆతర్వాత ఇంట్లో స్వప్నకు హారతి ఇచ్చి ఇంటిలోకి బేబీని ఆహ్వానిస్తుంది. ఈ శుభసందర్భంలో అందరూ సంతోషంగా ఉంటారు. లక్ష్మీ దేవి ఇంటికి వచ్చిందని అందరూ ఆనందపడుతుంటే ధాన్యలక్ష్మి మాత్రం ఈ లక్ష్మీ దేవీ రాకతో అయినా ఎవరి ఆస్తి వాళ్ల కి వస్తే బాగున్ను అంటుంది. ఆ మాటలకు అందరూ గడ్డి పెడతారు. రుద్రాణి మాత్రం వంకరగా మాట్లాడుతుంది. ఇందిరా దేవీ పుట్టిన పాపను దీవించి నీ పెళ్లి కుడా ఇక్కడే జరగాలి అంటే రుద్రాణి అప్పటిదాక ఎవరు ఉంటారో పోతారో అంటుంది.
మగపిల్లోడిని కని వారసుడిని తీసుకొస్తుంది అనుకుంటే ఆడపిల్ల పుట్టి నాశనం చేసింది అని రుద్రాణి తిడుతుంది. ఈలోపు రాజ్‌కి హాస్పిటల్ నుంచి తాతయ్య కోమా నుంచి బయటకు వచ్చిన విషయం చెప్తే అందరూ సంతోషపడతారు. ఇంటికి వచ్చిన పాప వెంటనే మంచి వార్త తీసుకొచ్చింది అని అందరూ హాస్పటల్‌కు వెళ్తారు. హాస్పిటల్‌లో బావని చూడటానికి వెళ్లిన చిట్టీ ఒకరిని ఒకరు చూసుకుని ఎమోషనల్‌గా మాట్లాడుకుంటారు. మీ తాళి చాలా గట్టిది మిమ్మళ్ని వదిలి ఎక్కడికి వెళ్లరు అని కావ్య అంటే నా చావు సుమంగళిగా ఆయన ఒడిలో జరగాలి అని మాట్లాడుకుంటారు. సీతారామయ్య కంపెనీ గురించి అడిగితే కావ్య అవన్నీ వదిలేయమని అంటుంది. ఈలోగా డాక్టర్ వచ్చి తాత ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పి డిస్చార్జ్ చేస్తామని చెప్తాడు.
తాతయ్య ఇంటికి వచ్చే లోగా అన్ని ప్రాబ్లెమ్స్ సాల్వ్ చేయాలని రాజ్ అనుకుంటాడు. ఇంకో సీన్‌లో పోలీస్ అలియాస్ అప్పు పోలీస్ గెటప్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇస్తుంది. అలా వచ్చి గన్‌తో కనకంకు గురి పెట్టి భయపెడుతుంది. ఆ తత్వాత నీ పెద్ద కూతురుకు కూతురు పుడితే నీ నీ చిన్న కూతురికి చెప్పవా అని అడగుతుంది. అప్పుడే వెనకాల నుంచి అప్పు తండ్రి గుర్తుపట్టి కూతురిని గుర్తుపట్టలేదా అంటాడు. దానికి కనకం నన్నే ఆటపట్టిస్తావా అని చీపురు పట్టుకుంటుంది. అప్పుని పోలీస్‌గా చూసి ఆనందపడతారు. ఆ తర్వాత అప్పు గురించి దుగ్గిరాల ఇంట్లో కుడా చెప్పమని చెప్తుంది. దుగ్గిరాల ఇంట్లో పాపకు బారసాల చేయాలని చూస్తుంటే దాన్యలక్ష్మి, రుద్రాణి ఆస్తి ప్రస్తావన ఎత్తుతారు. వాళ్ల మాటలకు కావ్య, రాజ్ సమాధానం చెప్పలేక మొహం తిప్పుకుంటారు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది..