Goodachari 2: మన తెలుగులో స్పై యాక్షన్ థ్రిల్లర్ల ట్రెండ్‌ను మార్చేసిన సినిమా ‘గూఢచారి’. ఇప్పుడు ఈ సినిమాకు కొనసాగింపుగా ‘గుడాచారి’ తెరకెక్కుతోంది. దీనిపై అటు ప్రేక్షకుల్లో, ఇటు ఇండస్ట్రీ వర్గాలలో భారీ అంచనాలే ఉన్నాయి. అడివి శేష్ కొత్తగా కనిపించడమే కాదు.. తన కథల ఎంపికతో.. యూత్‌ను, మాస్ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంటున్నాడు. ‘గూఢచారి’ సినిమా మిస్టరీ, యాక్షన్, ఎమోషన్‌తో మిలియన్ డాలర్ మూవీగా నిలిచింది. అంతేకాదు, ఈ సినిమాకి సీక్వెల్ ని ప్రకటించినప్పటి నుంచి దీని కోసం ప్రతీ ఒక్కరు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకి తాజాగా మేకర్స్ ఈ మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు.
‘గూఢచారి 2’ నుంచి ఇప్పటివరకూ వచ్చిన యాక్షన్ సీక్వెన్స్, ఇంటెన్స్ పోస్టర్లతో, అలాగే.. అడివి శేష్ లుక్‌తో బాగా బజ్ క్రియేట్ అయింది. ఈ అప్‌డేట్స్‌తో ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్ అయ్యారు. ఈ సినిమాని కొత్త దర్శకుడు వినయ్ కుమార్ సిరిగినీడి తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ మూవీని భారీ బడ్జెట్‌తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఇక నుంచి ‘గూఢచారి 2’ కి సంబందించిన అప్‌డేట్స్ అన్నీ వరుసగా రానున్నాయట.
Also Read – YCP leader: ‘సచివాలయానికి నిన్ను ఉరేస్తా.. ఖబడ్దార్’ – వీఆర్వోకు వైసీపీ నేత బెదిరింపులు
దీనిలో భాగంగా, అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న రిలీజ్ డేట్‌కి సంబంధించి ఫైనల్ గా మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ‘గూఢచారి 2’ మూవీ 2026 మే 1న వరల్డ్‌వైడ్‌గా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తెలుగుతో పాటు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల చేస్తారు. ఇక గూఢచారి 2 చిత్రాన్ని 6 దేశాల్లో, 23 భారీ సెట్స్ వేసి, 150 రోజులకు పైగా చిత్రీకరణ జరిపారట. ఇప్పటి వరకు మన ఇండియన్ యాక్షన్ సినిమాల్లో చూడని విధంగా గ్రాండ్ విజువల్ ట్రీట్ ఉండబోతుందని చిత్రబృందం ధీమాను వ్యక్తం చేస్తోంది.
కాగా, ఈ సినిమాలోని క్యాస్టింగ్ కూడా ఎంతో ప్రత్యేకంగా ఉంది. అడివి శేష్‌కు జంటగా వామికా గబ్బి నటిస్తున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ ఇమ్రాన్ హాష్మీ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. అడవి శేష్, ఇమ్రాన్ ల మధ్య సీన్స్ ఇంటెన్స్‌గా, ఎమోషనల్‌గా ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా, అబ్బూరి రవి డైలాగ్స్ రాశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ వంటి క్రేజీ బ్యానర్లు నిర్మాణంలో భాగస్వామ్యం కావడం సినిమాకు బాగా కలిసొచ్చే అంశం. ఇటీవల హిట్ 3 లో గెస్ట్ అపీరియన్స్ ఇచ్చిన శేష్, మంచి ప్రశంసలను అందుకున్నారు. ఇక మృణాల్ ఠాకూర్ తో కలిసి చేస్తోన్న ‘డెకాయిట్’ మూవీ కూడా రిలీజ్ కి రెడీ అవుతోంది.
Also Read – Raashi khanna: పవన్ సినిమాతో రీ ఎంట్రీ


