Gowtham Tinnanuri: కింగ్డమ్ మూవీతో దర్శకుడిగా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చారు గౌతమ్ తిన్ననూరి. విజయ్ దేవరకొండ హీరోగా స్పై యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతుంది. మిక్స్‌డ్ టాక్‌తో సంబంధం లేకుండా రెండు రోజుల్లోనే 53 కోట్ల వసూళ్లను రాబట్టింది. విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది.
రామ్‌చరణ్‌తో సినిమా…
కింగ్డమ్ మూవీకి విజయ్ దేవరకొండ యాక్టింగ్‌తో పాటు గౌతమ్ తిన్ననూరి స్టోరీ, స్క్రీన్‌ప్లే టేకింగ్ హైలైట్‌గా నిలిచాయనే ప్రశంసలు వినిపిస్తున్నాయి. కింగ్డమ్ కంటే ముందు రామ్‌చరణ్‌తో గౌతమ్ తిన్ననూరి ఓ సినిమా చేయాల్సింది. అఫీషియల్‌గా అనౌన్స్ అయిన తర్వాత ఈ మూవీ ఆగిపోయింది. గౌతమ్ తిన్ననూరి సిద్ధం చేసిన కథ నచ్చకపోవడంతోనే చరణ్ ఈ సినిమాను పక్కనపెట్టినట్లు వార్తలొచ్చాయి. రామ్‌చరణ్‌తో సినిమా ఆగిపోవడంతో విజయ్ దేవరకొండతో కింగ్డమ్‌ను మొదలుపెట్టాడు గౌతమ్ తిన్ననూరి. మరోవైపు చరణ్ కూడా గౌతమ్ తిన్ననూరి మూవీ ప్లేస్‌లో బుచ్చిబాబు సానా డైరెక్షన్‌లో పెద్ది మూవీని సెట్స్‌పైకి తీసుకొచ్చారు.
Also Read- sravanthi chokarapu: చీరకట్టులో సొగసుల విందు చేసిన టాప్ యాంకర్
పాయింట్ నచ్చింది కానీ…
తాజాగా కింగ్డమ్ ప్రమోషన్స్‌లో రామ్‌చరణ్‌తో సినిమా ఆగిపోవడానికి గల కారణాలను డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి రివీల్ చేశాడు. ఫస్ట్ టైమ్ రామ్‌చరణ్‌ను కలిసినప్పుడు స్టోరీ ఐడియా చెప్పాను. ఆ పాయింట్ విని చరణ్ ఎగ్జైట్ అయ్యారు. ఆ తర్వాత కోర్ పాయింట్‌ను కథగా మార్చి చరణ్‌కు వినిపించా. బౌండ్ స్క్రిప్ట్ మాత్రం చరణ్‌కు అంతగా నచ్చలేదు. ఆయన అనుకున్న విధంగా కథ రాలేదనిపించింది. చరణ్‌తో సినిమా అన్నది లైఫ్ టైమ్ ఆఫర్…కథ విషయంలో కాంప్రమైజ్ ఏదో ఒకలా సినిమా చేయడం కరెక్ట్ కాదనిపించింది. సాలిడ్ స్టోరీతోనే రామ్‌చరణ్‌తో సినిమా చేస్తే బాగుంటుందని ఫిక్సయ్యా. మంచి స్క్రిప్ట్‌తో మిమ్మల్ని మళ్లీ కలుస్తానని చరణ్‌కు చెప్పా. ఆయన కూడా నా మాటలను పాజిటివ్‌గానే తీసుకున్నారు. ఎప్పుడైనా కలవచ్చని అన్నారు. అలా ఈ సినిమా నుంచి నేను బయటకు వచ్చా అని గౌతమ్ తిన్ననూరి అన్నాడు.
సినిమా తీస్తా…
రామ్‌చరణ్ కోసం సిద్ధం చేసిన కథ మాత్రం నాకు బాగా నచ్చింది. ఇప్పుడు చదివినా ఓ ఎగ్జైటింగ్ ఫీలింగ్ కలుగుతుంది. భవిష్యత్తులో ఆ స్టోరీకి తగ్గ హీరో దొరికితే చరణ్ రిజెక్ట్ చేసిన కథతో సినిమా తీస్తానని గౌతమ్ తిన్ననూరి అన్నాడు. అతడి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Also Read- Nidhi Agarwal: శ్రీకాకుళంలో సందడి చేసిన వీరమల్లు ముద్దుగుమ్మ
మ్యాజిక్ షూటింగ్ కంప్లీట్…
కింగ్డమ్‌కు సీక్వెల్‌ను మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్‌చేశారు. పార్ట్ 2కు సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్‌ను దాదాపు పూర్తయినట్లు కింగ్డమ్ ప్రమోషన్స్‌లో గౌతమ్ తిన్ననూరి అన్నాడు. కింగ్డమ్ కంటే ముందు మ్యాజిక్ పేరుతో కొత్త ఆర్టిస్టులతో మ్యూజిక్ బేసేడ్ మూవీ చేశాడు గౌతమ్ తిన్ననూరి. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. త్వరలోనే మ్యాజిక్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మ్యాజిక్ మూవీకి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.


