Krithi Shetty: ఏ సినిమా ఎప్పుడు ఎవరికి సక్సెస్ ఇచ్చి స్టార్‌ని చేస్తుందో, ఏ సినిమా డిజాస్టర్ అయితే ఒక్కసారిగా కిందకి పడేస్తుందో.. ఏ ఒక్కరూ చెప్పలేరు. మరీ ముఖ్యంగా ఒక హీరోయిన్ దశాబ్దం కాలంగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగాలంటే ఎన్నో లెక్కలుంటాయి. లక్‌తో పాటు సక్సెస్‌ల మేనియా చాలా ముఖ్యం. అదే సమయంలో హీరో లేదా దర్శక నిర్మాతల సపోర్ట్ కూడా ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే ఒక హీరోయిన్ చిత్ర పరిశ్రమలో నెగ్గుకొస్తుంది.
ఇక సక్సెస్‌లు వస్తున్నప్పుడే ఏ హీరోయిన్ అయినా డిమాండ్ చేసి సంపాదించుకుంటారు. లేదంటే ఓ యాడ్ ఫిల్మ్ చేసే ఛాన్స్ కూడా కష్టం అవుతుంది. మన తెలుగులో ఉప్పెన చిత్రం ఓ సంచలనం. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన పంజా వైష్ణవ్ తేజ్ ఈ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఇదే సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి వచ్చిన బ్యూటీ కృతిశెట్టి. ఈ కన్నడ బ్యూటీ 17 ఏళ్ల వయసులోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. సూపర్ 30 అనే హిందీ సినిమాలో నటించింది. దీని తర్వాతనే తెలుగులో ఉప్పెనలా దిగింది.
Also Read- Katrina Kaif: తల్లి కాబోతున్న ‘మల్లీశ్వరీ’ హీరోయిన్ – బేబీ బంప్ ఫొటోలతో గుడ్‌న్యూస్
ఉప్పెన మూవీ సక్సెస్‌తో టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారింది. యంగ్ హీరోలకి మంచి జోడీ కావడంతో మేకర్స్ వరుసగా ఛాన్సులిచ్చారు. అలా, కృతి శెట్టి తెలుగులో నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్, నాగార్జున-నాగ చైతన్యల బంగార్రాజు చిత్రాల్లో నటించి హ్యాట్రిక్ హిట్స్ అందుకుంది. అయితే, ఈ సినిమాల తర్వాత ది వారియర్, మాచర్ల నియోజక వర్గం లాంటి సినిమాలు కృతిని బాగా నిరాశపరిచాయి. దాంతో ఇతర సౌత్ భాషల మీద దృష్ఠి పెట్టింది. కానీ, అక్కడ కూడా ఈ కన్నడ బ్యూటీకి సక్సెస్‌లు దక్కలేదు.
ప్రస్తుతం కృతిశెట్టి మూడు సినిమాలలో హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే, వాటిలో ఒక్కటి కూడా తెలుగు సినిమా లేకపోవడం కాస్త షాకింగ్ విషయమే. తమిళంలోనే మూడు సినిమాలను చేస్తున్న కృతి శెట్టి, వాటి మీదే ఆశలన్నీ పెట్టుకుంది. ప్రదీప్ రంగనాథ్ సరసన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ సినిమాలో నటిస్తున్న కృతి.. కార్తీ సరసన ఓ సినిమా, రవి మోహన్ సరసన ఓ సినిమాను చేస్తోంది. ఈ మూడు తమిళ సినిమాలలో కనీసం రెండైనా హిట్ సాధించాలి. అప్పుడే మళ్ళీ కృతికి తెలుగులో ఛాన్సులు వచ్చే అవకాశం ఉంది. లేదంటే ఇప్పుడున్న పోటీకి తట్టుకోవడం చాలాకష్టం.


