ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో 2023లో విడుదలైన ‘మ్యాడ్’ మూవీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి సీక్వెల్‌గా ‘మ్యాడ్ స్క్వేర్'(MAD Square) రూపొందిస్తున్నారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పాటలు ఆకట్టుకున్నాయి. తాజాగా మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. గోవాకు వెళ్లిన తరువాత ముగ్గురు యువకులకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. వాటి నుంచి వారు ఎలా బయటపడ్డారనే విషయాలతో చిత్రం తెరకెక్కినట్లు ట్రైలర్‌ను చూస్తుంటే అర్థమవుతోంది.
భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ మూవీని సితార ఎంటర్ టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్‌పై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇక కళ్యాణ్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.