Saturday, October 5, 2024
Homeచిత్ర ప్రభAN Hotels : మరో కొత్త బిజినెస్ లోకి మహేష్.. భార్య పేరుతో..

AN Hotels : మరో కొత్త బిజినెస్ లోకి మహేష్.. భార్య పేరుతో..

- Advertisement -

AN Hotels : మహేష్ బాబు ఓ పక్క సినిమాలు చేస్తూనే యాడ్స్, బిజినెస్ లతో కూడా డబ్బులు బాగానే సంపాదిస్తాడు. సంపాదించిన డబ్బులతో సేవా కార్యక్రమాలు కూడా బోల్డన్ని చేస్తాడు. ఇప్పటికే మహేష్ బాబు థియేటర్స్, క్లాతింగ్ బిజినెస్ లలో ఉన్నారు. ఆసియన్ గ్రూప్ తో కలిసి AMB మాల్ లో థియేటర్స్ నడుపుతున్నారు.

తాజాగా అదే ఆసియన్ గ్రూప్ తో కలిసి మరో బిజినెస్ లోకి దిగుతున్నారు మహేష్. అయితే ఈ సారి తన భార్య నమ్రత శిరోద్కర్ పేరుతో ఈ బిజినెస్ చేస్తున్నాడు. AN రెస్టారెంట్స్ పేరుతో హోటల్స్ మొదలుపెట్టనున్నాడు మహేష్. హైదరాబాద్ లోనే ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయబోతున్నాడు. ఇప్పటికే అంతా రెడీ అయిపోయి ఓపెనింగ్ కి రెడీగా ఉంది. డిసెంబర్ 8 నుంచి ఈ AN హోటల్ మొదలు కానుంది.

డిసెంబర్ 8 న AN హోటల్ మొదటి బ్రాంచ్ ని ఘనంగా ఓపెన్ చేయనున్నారు. అనంతరం హైదరాబాద్ లో మరిన్ని బ్రాంచ్ లు ఓపెన్ చేయనున్నారు. ఇప్పటికే అన్ని రంగాల్లో సక్సెస్ సాధించిన మహేష్ ఈ రంగంలో కూడా సక్సెస్ సాధించాలని పలువురు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News