తన నటనతో మెప్పించే నందమూరి జూనియర్ ఎన్టీఆర్(Hero Jr.NTR) తన అభిమానులకు మంచి శుభవార్త చెప్పారు. తన ఫ్యాన్స్ అందర్నీ వ్యక్తిగతంగా వచ్చి కలిసేందుకు ఓ మంచి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇందు కోసము ఎన్టీఆర్ ఓ ప్రత్యేక ఈవెంట్ హైద్రాబాద్ నందు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
ఇందుకోసం అన్ని అనుమతులు తీసుకోనున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు. అందుకు కొంచం సమయం పడుతుందని అంత వరకు అభిమానులందరు ఓర్పు, సహనంతో ఉండాలని చెప్పుకొచ్చారు. అంతే కాదు తనని కలిసేందుకు ఎవరు కూడా సాహసాలు చేయద్దని చెప్పారు. మరి ముఖ్యంగా పాదయాత్రలు వంటివి చేయరాదన్నారు. దయచేసి అభిమానులందరు ఇందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
తనను కలిసేందుకు వేల మంది అభిమానులు ఎదురు చూస్తున్నారని తెలుసుకున్న ఎన్టీఆర్ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నట్లు సమాచారం. దీనిని బట్టి చూస్తే ఎన్టీఆర్ కి తన అభిమానుల మీద ఎంత ప్రేమనో అర్థమౌతుందని తెలుస్తోంది.
ఎన్టీఆర్ ప్రస్తుతం హృతిక్ రోషన్‌తో కలిసి వార్ 2 షూటింగ్‌లో ఉన్నారు. ఇది ఈ సంవత్సరం ఆగస్టులో విడుదల కానుంది.
Jr. NTR: తన అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ గుడ్ న్యూస్
- Advertisement -
సంబంధిత వార్తలు | RELATED ARTICLES