పదేపదే పబ్లిక్ అప్పియరెన్స్ ఇవ్వటం, సోషల్ మీడియాలో అతి యాక్టివ్ గా ఉండటం రణవీర్ సింగ్ కొంప ముంచుతోందని సినిమా ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ కుండబద్ధలు కొట్టారు. రణవీర్ సింగ్, రణవీర్ కపూర్ మధ్య ఉన్న అతి పెద్ద తేడా ఇదేనని, చాలా అరుదుగా కనిపించే రణబీర్ కపూర్ సినిమా వస్తోందంటే మార్కెట్లో మంచి బజ్ వస్తుందని తరణ్ వివరించారు. సినిమా ప్రమోషన్ వర్క్, ఆతరువాత నెక్ట్స్ సినిమా స్క్రిప్టు, షూటింగులతో గడపటం రణబీర్ ఫాలో అయ్యే బెస్ట్ స్ట్రాటెజీ అని తరణ్ తేల్చారు.
రణవీర్ సింగ్ అయితే యాడ్స్, టీవీ ప్రోగ్రామ్స్ లో గెస్టుగా-ప్రెజెంటర్ గా రోజూ చూస్తారని పైగా అలా చూసి చూసి బోర్ కొడుతుందని ఇంకోవైపు రణవీర్ సోషల్ మీడియాలో పోస్టింగ్స్, పబ్లిక్ అప్పియరెన్స్ ఎక్కువగా ఇవ్వటంతో మార్కెట్ తగ్గుతోందన్నారు. సినిమా రిలీజ్ కు తప్ప పబ్లిక్ అప్పియరెన్స్ ఇవ్వకుండా రణబీర్ స్ట్రాటెజీ వర్కౌట్ అవుతుంటే.. రణవీర్ మాత్రం ఓవర్ ఎక్స్ పోజ్ అవుతున్నారని తరణ్ తేల్చారు. బాక్సాఫీస్ ఫ్రెండ్లీ స్టార్ గా ఉండాలంటే పబ్లిక్ కు ఓవర్ గా ఎక్స్ పోజ్ కాకూడదనేది సక్సెస్ మంత్రాగా ఆయన చెబుతున్నారు.