Friday, April 4, 2025
Homeచిత్ర ప్రభPooja Hegde : పాపం ఆ స్టార్ హీరోయిన్.. నడవలేకపోతుంది..

Pooja Hegde : పాపం ఆ స్టార్ హీరోయిన్.. నడవలేకపోతుంది..

- Advertisement -

Pooja Hegde : స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే ప్రస్తుతం తెలుగు , తమిళ్, హిందీలో వరుస సినిమా ఆఫర్స్ తో బిజీగా ఉంది. సినిమాల రిజల్ట్స్ తో సంబంధం లేకుండా పూజా ఆఫర్స్ కొట్టేస్తుంది. కానీ పూజా హెగ్డే ఇప్పుడు సినిమాలకి బ్రేక్ ఇచ్చింది. ఇటీవల ఈ బుట్టబొమ్మ ఓ సినిమా షూటింగ్ లో గాయపడింది. కాలికి బాగా దెబ్బ తగలడంతో షూట్ ఆపేసి వచ్చేసింది.

అయితే ఇది మొదట చిన్న దెబ్బే అనుకున్నా పూజాకి ఎక్కువ ఎఫెక్ట్ చూపించింది. కనీసం నడవలేని పరిస్థితుల్లో ఉంది పూజా. ప్రస్తుతం చికిత్స తీసుకుంటూ ఇంట్లోనే ఉంటుంది. తాజాగా పూజా హెగ్డే ఓ వీడియోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో పూజా వాకర్ పట్టుకొని పక్కన నర్స్ సాయంతో నడుస్తుంది.

దీంతో ఈ వీడియో చుసిన వాళ్లంతా పూజాహెగ్డే త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఇక అభిమానులు అయితే మా పూజా పాపని ఇలా చూడలేకపోతున్నాం, త్వరగా నడవాలి, మళ్ళీ సినిమా సెట్స్ లోకి రావాలని కోరుకుంటున్నారు. ఈ వీడియోని పూజాహెగ్డే పోస్ట్ చేసి.. నేను మళ్ళీ లైఫ్ లో సెకండ్ టైం నడక నేర్చుకుంటున్నాను. చాలా జాగ్రత్తగా నడుస్తున్నాను అని పోస్ట్ చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News