Rashmika Mandanna: హీరో విజయ్ దేవరకొండతో రష్మిక మందన్న ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు కొన్నాళ్లుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. విజయ్ దేవరకొండతో పాటు రష్మిక మందన్న ఎంగేజ్‌మెంట్ రింగ్స్‌తో కనిపించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే ఎంగేజ్‌మెంట్ వార్తలను ఇప్పటివరకు విజయ్‌తో పాటు రష్మిక అఫీషియల్‌గా ప్రకటించలేదు.
ప్రస్తుతం ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ ప్రమోషన్స్‌లో రష్మిక మందన్న బిజీగా ఉంది. ఈ ప్రమోషన్స్‌లో భాగంగా ఎంగేజ్‌మెంట్ గురించి చెప్పాలంటూ అభిమానులు రష్మికను అడిగారు. వారి ప్రశ్నలకు సిగ్గుపడిపోయిన రష్మిక మందన్న… ఎప్పుడు చెప్పాలో అప్పుడే చెప్తాను అంటూ బదులిచ్చింది. మీకు ఏం అనిపిస్తుందో అదే జరిగింది అంటూ చెప్పింది. ఎంగేజ్‌మెంట్ గురించి రష్మిక మందన్న చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అఫీషియల్‌గా కన్ఫామ్ చేసిందని నెటిజన్లు అంటున్నారు.
ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు విజయ్ దేవరకొండ గెస్ట్‌గా అటెండ్ కాబోతున్నట్లు నిర్మాత అల్లు అరవింద్ ప్రకటించారు. ఈ వేడుకలోనే తమ ఎంగేజ్‌మెంట్ గురించి విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న అఫీషియల్‌గా ప్రకటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎంగేజ్‌మెంట్ తర్వాత విజయ్, రష్మిక తొలిసారి జంటగా ది గర్ల్‌ప్రెండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరు కాబోతున్నారు. తమ మధ్య రిలేషన్‌ను బయటపెట్టేందుకు ఇదే మంచి వేదికగా ఇద్దరూ భావిస్తోన్నట్లు సమాచారం.
Also Read – RaviTeja: రవితేజ ‘మాస్ జాతర’ ట్రైలర్ అంచనాలు ఎందుకు తగ్గాయి?
ఇటీవలే రౌడీ జనార్థన షూటింగ్‌ను మొదలుపెట్టారు విజయ్ దేవరకొండ. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ నవంబర్ ఏడు వరకు జరుగనుంది. కానీ ది గర్ల్‌ఫ్రెండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం రౌడీ జనార్ధన షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిన విజయ్ దేవరకొండ మంగళవారం హైదరాబాద్‌కు వచ్చారు. విజయ్ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కాగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్నారు. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో హిస్టారికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపొందుతోంది. సెప్టెంబర్ లో ఈ సినిమా లాంఛ్ అయ్యింది. ఓ షెడ్యూల్ షూట్ చేశారు. గీతగోవిందం, డియర్ కామ్రేడ్ తర్వాత విజయ్, రష్మిక కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
మరోవైపు రష్మిక మందన్న ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో దీక్షిత్ శెట్టి, అను ఇమ్మాన్యుయేల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Also Read – Siddu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ ఖాతాలో మరో డిజాస్టర్ – స్టార్ బాయ్ జాగ్రత్త పడే టైమొచ్చింది!


