Saturday, October 5, 2024
Homeచిత్ర ప్రభRRR: దశాబ్దాల వైరమే ఫ్రెండ్స్ చేసింది..ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్: తారక్, చరణ్

RRR: దశాబ్దాల వైరమే ఫ్రెండ్స్ చేసింది..ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్: తారక్, చరణ్

రీల్ పైనే కాదు..రియల్ లైఫ్ లోనూ తాము మంచి దోస్తులు అయిపోయామని ఆర్ఆర్ఆర్ స్టార్స్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఎన్నోసార్లు చెప్పుకున్నారు. తాజాగా తమ ఇరు కుటుంబాల మధ్య ఉన్న వైరంతో తాము అలసిపోయామని, బోర్ కొట్టేసిందని వీరు చెప్పటం హైలైట్. రీసెంట్ గా లాస్ ఏంజిలెస్ లో జరిగిన గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్ టైంలో తమ మధ్య, తమ కుటుంబాల మధ్య ఉన్న రైవల్రీపై వీరు పెదవి విప్పటం ఫ్యాన్స్ కు ఆశ్చర్యం కలిగిస్తోంది.

- Advertisement -

లాస్ ఏంజిలెస్ టైమ్స్ కు ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో ఇలాంటి విషయాలపై సూపర్ స్టార్స్ ఇద్దరూ మనసు విప్పి ఎటువంటి బేషజాలకు పోకుండా మాట్లాడటం ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఘనమైన సినీ నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన ఈ ఇద్దరు తారలు.. గత మూడు దశాబ్దాలుగా ఇవన్నీ వినివినీ బోర్ కొట్టిందని వీరు వ్యాఖ్యానించారు. అసలు ఈ శతృత్వమే తమను దగ్గరికి చేర్చిందని కూడా ఓదశలో చరణ్ వెల్లడించారు.

హైదరాబాద్ లో జరిగిన ఓ సెలబ్రిటీ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా వీరిద్దరూ కలిసిపోయినట్టు తారక్, చరణ్ అసలు సీక్రెట్ వెల్లడించారు. “ఇదంతా సింపుల్ ఫిజిక్స్ ..ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ అవుతాయి..తనలో లేనిది చూసి చరణ్ అట్రాక్ట్ అయ్యాడు.. నేను కూడా అంతే ..అందుకే ఇద్దరం ఒకరంటే ఒకరికి ఆసక్తి పెరిగింది.. ఇదంతా ఓ సపోర్ట్ సిస్టం..కొన్ని సీక్రెట్స్ ఇద్దరం షేర్ చేసుకుంటాం.. ఒకరిని ఒకరు ప్రశంసించుకుంటాం”..అంటూ తారక్ చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News