హాట్ బ్యూటీ శ్రీరెడ్డి(Sri Reddy) ఈ పేరు గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు. గత కొద్ది సంవత్సరాల నుంచి ఏపీ రాజకీయాల్లో పెను సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. వైసీపీ సపోర్టర్‌గా, మాజీ సీఎం జగన్ అభిమానిగా ప్రతిపక్ష నాయకులపై మాటల యుద్ధం చేసేది. వ్యక్తిగత విమర్శలతో పాటు వృత్తిపరమైన విమర్శలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచేది. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయి.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కొన్ని రోజుల పాటు సైలెంట్ అయిపోయింది. మళ్లీ ఇటీవల సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వార్తల్లోనిలుస్తుంది. తాజాగా వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల(Anchro Syamala) గురించి శ్రీరెడ్డి పెట్టిన ఓ పోస్ట్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
యాంకర్ శ్యామల గత ఎన్నికల ప్రచారంలో వైసీపీకి మద్దతుగా ప్రచారం చేసిన విషయం విధితమే. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లపై పరోక్ష విమర్శలు చేస్తూ టీడీపీ, జనసేన కేడర్‌కు టార్గెట్ అయ్యారు. అయితే ఇటీవల ఆమెను వైసీపీ అధికార ప్రతినిధిగా ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. శ్యామలకు పదవి ఇవ్వడంపై శ్రీరెడ్డి సంచలన పోస్టులు పెట్టింది. ‘‘అదృష్టం అంటే ఈమెదే.. ఏమీ పార్టీ కోసం పని చేయకపోయినా అందలం ఎక్కించారు. జై వైఎస్సార్సీపీ, బెదిరింపులు, తిట్లు ఏమో మాకు పోస్టింగులు, ప్రెస్ మీట్ లు మూతి వంకర అందగత్తెలకి. పార్టీలోని ఆమెని తెలిసి తీసుకున్నారా? తెలియకనా. మైకులు ఆమె దగ్గరకు వెళ్తున్నాయి. రెడ్ లైట్‌ని తెగ హైలెట్ చేస్తున్నారు. ఇక శని నెత్తి మీద కూర్చున్నట్టే. జస్ట్ వెయిట్ మీకే తెలుస్తుంది’’ అని రాసుకొచ్చింది. దీంతో శ్రీరెడ్డి పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.