ఈరోజు ఎపిసోడ్‌లో మీనా ఏడుస్తూ ఉంటే ఎవరు ఏమి అన్నారు అని అడుగుతాడు. బాలుని పట్టుకుని తనలో ఉన్న బాధ అంతా బయటికి పెట్టి ఒక్క రోజు కుడా మొగుడి పక్కన పడుకోకుండా ఉండలేవా అన్నారని ఏడుస్తుంది. ఎవరన్నారని అడిగితే ఈలోపు రోహిణి ఆంటీ ఏ అన్నారు అని చెప్తుంది. రూమ్ ఇవ్వలేదని అంత మాట ఎలా అంటారు నాకు నచ్చలేదు మీరు అన్నా మాట అంటుంది. వెంటనే బాలు ఏంటి అమ్మా ప్రభావతమ్మా నా భార్యని ఇంత మాట అంటావా, చూశావా నాన్న మీ భార్య, నా భార్యతో ఇలా మాట్లాడుతుందా అంటాడు.
వాళ్లకి రూమ్ ఇవ్వడం ఇష్టం లేక నేనే తాళం వేసుకుని వెళ్లాను అంటే నన్ను అను నా భార్య ఏమి చేసింది అని అడుగుతాడు. అడగడానికి ఎవరు లేరని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతావా అని అంటాడు. సరే అని తాళం తీసి పద మీనా వెళ్లిపోదాం అని తీసుకెళ్లిపోతాడు. సత్యం ఏమో ప్రభావతిని రూమ్‌లోకి తీసుకెళ్లి శుభ్రంగా తిడతాడు. నువ్వు అన్నమాట నీ కోడలు తిరిగి అంటే మొహం ఎక్కడ పెట్టుకుంటావు అని అడుగుతాడు. గొప్పింటి నుంచి వచ్చినా పేద ఇంటి నుంచి వచ్చినా వాళ్లు ఈ ఇంటి కోడళ్లు ముగ్గురిని సమానంగా చూడమని ఎన్ని సార్లు చెప్పాలి అంటాడు సత్యం.
రూమ్‌కి పరిష్కారం నేను చెప్తాను అని కిందకి తీసుకుని వెళ్తాడు. అందరినీ పిలవమంటే కేవలం మనోజ్, రోహిణిలను పిలుస్తుంది. నీ బుద్ధి చూపించుకున్నావు అంటాడు సత్యం. బాలు. మీనాని పిలు అంటాడు అప్పుడు. అందరూ వచ్చాక ఇళ్లు అంటే ప్రశాంతంగా ఉండాలి కుంపటిలాగ కాదు అంటాడు సత్యం. మధ్యలో రోహిణి, మనోజ్, బాలు గొడవ పడతారు. సత్యం వాళ్లని ఆపి కొత్తగా పెళ్లి అయిన వాళ్లకి మా రూమ్ ఇస్తాము అని తన నిర్ణయం చెప్తాడు. అప్పుడు మీ రూమ్ వద్దు మాదే ఇస్తాము అని మీనా అంటుంది. లక్షలు మింగినోడు ఇస్తాడు అంటే మేము ఆఫీస్‌కి టైంకి వెళ్లాలి మాకు కుదరదు అంటారు. మీరు ఎవరూ త్యాగం చేయాల్సిన అవసరం లేదు నేను హాల్‌లోనే పడుకుంటాను అంటాడు.ఇంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.