Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభKulasekhar: ప్రముఖ గీత రచయిత కన్నుమూత

Kulasekhar: ప్రముఖ గీత రచయిత కన్నుమూత

Kulasekhar| టాలీవుడ్ ప్రముఖ గీత రచయిత కులశేఖర్‌(53) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కులశేఖర్‌ చికిత్స పొందుతూ సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 1971 ఆగస్ట్‌ 15న ఏపీలోని సింహాచలంలో జన్మించిన కులశేఖర్‌కు చిన్నతనం నుంచీ సాహిత్యంపై ఆసక్తి ఉండేది. చదువు పూర్తి చేసిన తర్వాత విలేకరిగా పనిచేశారు. దివంగత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి వద్ద అసిస్టెంట్‌గా పనిచేశారు.

- Advertisement -

ఉషాకిరణ్‌ మూవీస్‌ పతాకంపై ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వంలో రూపొందిన ‘చిత్రం’ ద్వారా పాటల రచయితగా పరిచయమయ్యారు. ఆ తర్వాత ఎన్నో సినిమాలకు గీత రచయితగా పనిచేశారు. రామ్మా చిలకమ్మా, వసంతం, మృగరాజు, సుబ్బు, దాదాగిరి, జయం, నువ్వు నేను, ఔనన్నా కాదన్నా, వసంతం, వంటి సినిమాల్లో సూపర్‌హిట్‌ సాంగ్స్‌ రాశారు. ఇప్పటివరకు ఆయన కెరీర్‌లో మొత్తం దాదాపు 100 పాటలు రాశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad