Saturday, November 23, 2024
Homeచిత్ర ప్రభVanisri: యాక్షన్ ఇరగదీయటమే ఆమెకు తెలుసు

Vanisri: యాక్షన్ ఇరగదీయటమే ఆమెకు తెలుసు

ఆమె అచ్చతెలుగు అందం, బ్లాక్ బ్యూటీ. కాన్ఫిడెన్స్ ఆమె ఇంటిపేరు, ఒక్కోసారి ఆ కాన్ఫిడెన్సే పొగురుగా ధ్వనిస్తుంది. క్యారెక్టర్ ఏదైనా ఇరగదీయటం మాత్రమే ఆమెకు తెలిసిన మెస్మరైజింగ్ టాలెంట్. అందుకే నాటితరం వారంతా ఆమెకు డై హార్డ్ ఫ్యాన్స్ గా మారిపోయారు. ఫిల్మ్ ఫీల్డ్ లో తిరుగులేని యాక్టర్ గా, మహానటిగా తన స్పెషాలిటీ చాటిన గ్లామర్ క్వీన్ వాణిశ్రీ ఆతరువాత పాలిటిక్స్ లోనూ కొద్దికాలంపాటు రాణించారు.
ఆల్ టైం ఫేవరెట్

- Advertisement -

నెల్లూరులో పుట్టి చెన్నైలో సెటిల్ అయిన వాణిశ్రీ తెలుగువారికి ఆల్ టైం ఫేవరెట్ హీరోయిన్స్ లో టాప్ పొజిషన్ లో ఉంటారు. వాణిశ్రీ అసలు పేరు రత్న కుమారి. స్క్రీన్ నేమ్ మాత్రమే వాణిశ్రీ. 1948లో పుట్టిన లెజెండరీ హీరోయిన్ వాణిశ్రీ. ఆమె తండ్రి వాణిశ్రీ, వాణిశ్రీ సిస్టర్స్ ను బాగా చదివించాలని భావిస్తే ఈమెకు మాత్రం మనసు భరతనాట్యంపై ఉండేది. 12 ఏళ్ల వయసులో చెన్నైలోని ఆంధ్రమహిళా సభలో చదువుతుండగా ఓ డ్యాన్స్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈ ప్రోగ్రాంకు వచ్చిన ఓ కన్నడ డైరెక్టర్ స్టార్ యాక్ట్రెస్ సావిత్రిలా ఈమె ఉందే అని అనుకోవటంలోనే రత్న కుమారి వాణిశ్రీగా మారేందుకు ఛాన్స్ ఇచ్చింది.

తొలి సినిమా తెలుగులో కాదు
కన్నడతో ఫిలిం కెరీర్ స్టార్ట్ అయింది. కన్నడ సినిమాలో ఒకదాంట్లో రత్నకు లీడ్ రోల్ ప్లే చేసే ఆపర్చునిటీ వచ్చింది. తల్లి సినిమాలు వద్దని అబ్జెక్షన్ చెబుతున్నా ఆమె వినలేదు. కానీ ఆ సినిమా హిట్ అయింది. అంతే ఇక కన్నడా, ఆతరువాత తమిళ్ లో వరుసపెట్టి ఆఫర్స్ వచ్చిపడ్డాయి హీరోయిన్ రత్నకు. కన్నడ, తమిళ్ లో బిజీ యాక్టర్ గా మారిన రత్నకు చిన్నగా తెలుగులో ఛాన్సులు రావటం స్టార్ట్ అయింది. కానీ అన్నీ చిన్న రోల్సే ఆమెకు దక్కేవి. ఇలా భీష్మ సినిమాతో ఆమె తెలుగు తెరపై 1962లో ఆరంగేట్రం చేశారు. ఆతరువాత ఎస్వీ రంగారావు హీరోయిన్ రత్న కుమారి పేరును వాణిశ్రీగా మార్చారు. నిజానికి శ్రీవాణి ఫిలిమ్స్ అనే ఆయన సొంత కంపెనీ పేరును ఎస్వీ రంగారావు తిరగతిప్పి అంటే ఉల్టా చేసి వాణిశ్రీగా మార్చారు.

బిగ్ బ్రేక్ ఇచ్చిన బాలచందర్

ఇక సపోర్టింగ్ రోల్స్, కామెడీ రోల్స్ చేస్తూ తెలుగు మూవీస్ లో ఆమె కెరీర్ కంటిన్యూ చేశారు. కానీ సుఖదుఃఖాలు సినిమా ఆమె కెరీర్ కు పెద్ద టర్నింగ్ పాయింట్ తెచ్చింది. సుఖదుఃఖాలు సినిమాలో ఆమె సిస్టర్ రోల్ లో ఆకట్టుకున్నారు. ఇది బాలచందర్ సినిమా, సో బాలచందర్ ఆమెకు బిగ్ బ్రేక్ ఇచ్చిన డైరెక్టర్ అన్నమాట. ఆతరువాత.. ఇక వాణిశ్రీ కాల్ షీట్స్ ఫుల్.. ఇయర్ అంతా బిజీ క్యాలెండర్. బాలచందర్ చాలామంది యాక్టర్స్ కు లైఫ్ ఇచ్చారు. లెజెండరీ యాక్టర్స్ ను ఇంట్రడ్యూస్ చేశారు. వారిలో వాణిశ్రీ కూడా ఒకరు.

కెరీర్ లో టర్నింగ్ పాయింట్ ఆ పాటే

సుఖదుఃఖాలు సినిమాలో ఇది మల్లెల వేళయని పాటలో వాణిశ్రీ మెరిసిపోయారు. ఈ పాట అప్పట్లో చాలా పెద్ద హిట్ సాంగ్. ఆ నెక్ట్స్ ఇయర్ వాణిశ్రీ హీరోయిన్ గా తెలుగులో కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఈసారి మరపురాని కథ సినిమాతో ఆమె మరపురాని హీరోయిన్ గా వెలిగిపోయారు. ఇదే టైంలో ఆమె కన్నడ, తమిళ్ లో సైమల్టేనియస్ గా యాక్ట్ చేస్తూపోయారు. ఆతరువాత నేషనల్ అవార్డ్ దక్కించుకుని తన దూకుడును కంటిన్యూ చేశారు. ఆ దూకుడు ఏ రేంజ్ లో ఉండేదంటే అన్ని సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లో ఆమె హీరోయిన్ గా వెలిగిపోయేంత. పైగా అందరూ టాప్ హీరోలతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసి హీరోయిన్ గా ఆమె తన లెక్కలేనన్ని హిట్స్ తన అకౌంట్లో వేసుకున్నారు.

ఏఎన్ఆర్ తో బ్లాక్ బస్టర్స్

అక్కినేని నాగేశ్వర్ రావుతో ఆమె ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు. దసరా బుల్లోడు ఆ లిస్టులో ఒకటి. ప్రేమ్ నగర్ క్లాసిక్ హిట్ మూవీ ఇప్పుడు కూడా మీరు ఈ సినిమా చూస్తే ఆ రొమాంటిక్, నస్టాల్జిక్ క్షణాల్లో లీనమైపోతారు. 70ల్లో ఆమె టాప్ హీరోయిన్. ఈ స్టేజ్ లోనే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ సినిమాల్లోకి గ్రాడ్యుయల్ గా మారుతోంది. కలర్ సినిమాల్లో మరింత అందంగా కనిపించేలా వాణిశ్రీ తీసుకున్న స్పెషల్ కేర్ ఆమెకు లెక్కలేనంతమంది ఫాలోయర్స్ ను తెచ్చిపెట్టింది. బ్లాక్ బ్యూటీ అయినా ఆమె వెండితెరపై మాత్రం కళ్లు చెదిరే అందంతో మెరిసిపోయేవారు. అమ్మాయంటే హీరోయిన్ వాణిశ్రీలా ఉండాలనేంత పిచ్చెక్కించిన గ్లామ్ డాల్ గా తన సొంత బ్రాండ్ వాల్యూ క్రియేట్ చేశారు వాణిశ్రీ.
బ్యూటీ సీక్రెట్ ఇదే
బ్రైట్ కాస్టూమ్స్ వేసుకోవటం, హెవీగా ప్యాన్ కేక్ మేకప్ వేసుకోవటం ఈమె స్పెషాలిటీ. ఇలా తన రంగు సెల్యులాయిడ్ పై కనపడకుండా ఆమె కనిపించిన తీరు ఆశ్చర్యం కలిగించక మానదు. అందుకే వాణిశ్రీ అసలు బ్లాక్ బ్యూటీ అనే విషయం చాలాకాలం వరకు ఎవరికీ తెలీదు. లిప్ స్టిక్స్, స్టిక్కర్స్, హెయిర్ స్టైల్స్ లో వాణిశ్రీలా ఎవరూ సాహసం చేసి ఎక్స్ పరిమెంట్స్ చేయలేదంటే నమ్మండి. కానీ ఇవన్నీ ఆమెను క్రేజీ -ఫ్యాషన్ ట్రెండ్ సెట్టర్ లా మార్చేసాయి. అందుకే ఆమె ఆ కాలానికే ట్రెండ్ సెట్టర్ గా సరికొత్త ఇమేజ్ క్రియేట్ చేసుకోగలిగారు.
సావిత్రికి దగ్గరి పోలిక ఉన్నందుకే..
వాణిశ్రీకి, సావిత్రికి చాలా దగ్గర పోలికలు ఉండటమే ఆమెకు సినిమా ఛాన్సులు తెచ్చిపెట్టాయనేది అసలు సీక్రెట్. కానీ వాణిశ్రీ మాత్రం తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ఉండేలా, డిఫరెంట్ స్టార్ గా కనిపించేందుకు కంటిన్యూగా ట్రై చేసేవారు. ఇదే వాణిశ్రీ లుక్స్ లో వేరియేషన్స్ కనిపించేలా చేసింది. అందుకే అదేపనిగా ఓ స్టేజ్ లో ఆమె సన్నగా మారారు. అప్పట్లో హీరోయిన్ అంటే లావుగా ఉండటమే ట్రెండ్ అయినా సావిత్రిలా కనిపించరాదనే ఏకైక కారణంతో వాణిశ్రీ భారీగా సన్నబడ్డారుకూడా. ఇదంతా ఆడియన్స్ కు కొత్తదనం చూపేలా చేసింది. అంతేకాదు వాణిశ్రీ ఫేస్ అంటే చాలా ఫోటోజెనిక్. దీనికి తోడు వాణిశ్రీ ఇంకో ప్రొఫెషనల్ ట్రిక్ ఫాలో అయ్యేవారట. కెమరామెన్లతో ఆమె చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. దీంతో ఆమెను అత్యంత అద్భుతమైన అందాల రాశిగా చూపేందుకు కెమరామెన్లు సాయశక్తులా ప్రయత్నించేవారు, తమలో తామే పోటీపడేవారు.

జస్ట్ గ్లామ్ డాల్ కాదు

కానీ జస్ట్ గ్లామ్ డాల్ గా మాత్రమే కాకుండా, స్టోరీ ఓరియెంటెడ్, హీరోయిన్ ఓరియెంటెడ్, టైటిల్ రోల్స్ ప్లే చేయటమే ఆమెకు ఫస్ట్ ఛాయిస్. సో కేవలం లుక్ పైన కేర్ తీసుకోవటమే కాదు తన రోల్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా స్క్రీన్ టైం కూడా ఆమె లెక్కలేసుకుని ఆతరువాతే సినిమా ఓకే చేసేవారు. అందుకే అంత బెస్ట్ క్యారెక్టర్స్ ప్లే చేసే ఛాన్స్ ఆమె అందుకున్నారు. డబుల్ రోల్స్ లో ప్లే చేసేందుకు ఆమె చాలా కష్టపడినా అవన్నీ ఆమెకు చెప్పలేనంత పేరు తెచ్చిపెట్టాయి. హీరో డామినేటెడ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వాణిశ్రీ సినిమా రిలీజ్ అంటే చూడాలి అనేలా ఆమె మార్కెట్ క్రియేట్ చేసుకోవటం హైలైట్. గంగా మంగా, వాణి రాణి, ఇద్దరమ్మాయిలు, సెక్రెటరీ, క్రిష్ణవేణి, జీవన జ్యోతి లాంటి సినిమాల్లో ఆమె సూపర్లేటివ్ పర్ఫార్మెన్స్ చూపించారు. ఒక సినిమాకు మించి ఇంకో సినిమాలో ఆమె క్యారెక్టరైజేషన్ ఉండటం, లుక్స్, యాక్టింగ్, డైలాగ్స్ఒక్కటేమిటి వాణిశ్రీ అంటే యాక్టింగ్ కోర్స్ కు ఓ కాంప్రిహెన్సివ్ గైడ్ లా కనిపించేలా ఆమె రోల్స్ సెలెక్ట్ చేసుకున్నారు.

వాణిశ్రీ మేనియా క్రియేటర్
వాణిశ్రీ మేనియానే క్రియేట్ చేసిన వాణిశ్రీ 1976లో తన వరుస సినిమాలతో ఊపేశారు. రోజుకు 16 గంటలు బోలెడు షిఫ్టుల్లో ఆమె పనిచేసేవారు. అందుకే 76లో ఫిలిం పేర్ మ్యాగజైన్ ఆమెతో స్పెషల్ ఫీచర్ చేయాలనుకుంటే వాణిశ్రీ బిజీ షెడ్యూల్, బిజియెస్ట్ క్యాలెండర్ చూసి ఆ టీమంతా షాక్ తింది. ఏడాదికి 14 సినిమాలు చేసే హీరోయిన్ ను మీరు ఏ ఫిలిం ఇండస్ట్రీలో చూసుండరు. కానీ ఈ క్రెడిట్ అంతా మన వాణిశ్రీకే దక్కింది. ఎటువంటి బ్రేక్స్ లేకుండా కంటిన్యూగా ఆమె ఒక సినిమా తరువాత ఇంకో సినిమాలో యాక్ట్ చేసుకుంటూ పోయారు.

వ్యాంప్ వేరు హీరోయిన్ వేరు

ఎదురులేని మనిషి షూటింగ్ టైంలోకాస్త ప్రొవకేటింగ్ గా రివీలింగ్ గా డ్రెస్ చేసుకోమని డైరెక్టర్ చెబితే నోవే అని తెగేసి చెప్పారు వాణిశ్రీ. హీరోయిన్స్ వ్యాంపుల్లా డ్రెస్ అవ్వటం, డ్యాన్స్ చేయటం అంటే వాణిశ్రీకి అస్సలు నచ్చదు. హీరోయిన్, వ్యాంప్ ఇద్దరూ వేర్వేరు అనేది ఈమె ఫిలాసఫీ. వింటుంటే మీకు కూడా అవుననే అనిపిస్తోంది కదూ. ఈమధ్య సినిమాల్లో వ్యాంపులకు అదే ఐటెం సాంగ్స్ చేసేవారికి హీరోయిన్స్ కు అస్సలు తేడా ఉండట్లేదు.

నాకా లైఫ్ వద్దని చెప్పిన డేరింగ్ హీరోయిన్

ఆతరువాత క్రమంగా రాఘవేంద్ర రావు వంటి డైరెక్టర్స్ రాకతో.. జయప్రద, జయసుధ, శ్రీదేవిలను తెరపైకి తేవటంతో తన టైం అయిపోయిందని గుర్తించారు వాణిశ్రీ. అంతే సింపుల్ గా, గ్రేషియస్ గా,గ్లామ్ వల్డ్ నుంచి గ్రాడ్యువల్ గా తప్పుకోవటం స్టార్ట్ చేశారు. తన ఫ్యామిలీ డాక్టర్ ను పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరంగా జరగటం మొదలుపెట్టారు. సినీ పరిశ్రమకు చెందనివారు , సెకెండ్ మ్యారేజ్ కానివారినే తాను మ్యారేజ్ చేసుకోవాలని డిసైడ్ అయినట్టు ఆమె కుండబద్ధలుకొట్టడం విశేషం. ఎందుకంటే అప్పట్లో హీరోయిన్స్ చాలామంది ఫిలిం ఫీల్డ్ కే చెందినవారిని లేదా సెకెండ్ మ్యారేజ్ పర్సన్స్ ను పెళ్లి చేసుకుని చాలా ఇబ్బందుల్లో పడ్డారని అందుకే తనకు అలాంటి లైఫ్ వద్దని ఆమె ఓపన్ గా కామెంట్ చేసేవారు.
అమ్మాయిలకు రోల్ మోడల్
అప్పట్లో 20 ఏళ్లకే అమ్మాయిలకు పెళ్లిళ్లి చేసేవారు.. కానీ వాణిశ్రీ మాత్రం 30 ఏళ్లలో వివాహం చేసుకుని ఆ జనరేషన్ అమ్మాయిలకు ఈ విషయంలో రోల్ మోడల్ గా నిలిచారు. అంతేకాదు తనకంటే కాస్త చిన్నవాడినే ఆమె పెళ్లి చేసుకోవటం అప్పట్లో పెద్ద సెన్సేషన్. ఇప్పుడంటే అన్ని ఫీల్డ్స్ లో వాళ్లు ముఖ్యంగా గ్లామర్ ఫీల్డ్ లో చాలామంది తమకంటే చిన్నవారితో డేటింగ్, లివిన్ లేదా మ్యారేజ్ చేసుకుంటున్న రోజులివి. కానీ అప్పట్లోనే ఆమె స్టీరియోటైప్ లైఫ్ కు నో చెప్పినట్టు మనకు వాణిశ్రీ పర్సనల్ లైఫ్ చూస్తే అర్థమవుతుంది. వాణిశ్రీ అంటే అంతే. రీల్ లైఫ్, రియల్ లైఫ్ లో కూడా చాలా గట్స్ ఉన్న వ్యక్తి. ఆమె వ్యక్తిత్వం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది.
థైరాయిడ్ తో లావై..

హీరోయిన్ గా తెరమరుగయ్యాక వాణిశ్రీ చాలా బరువు పెరిగి ఇబ్బందిపడ్డారు. థైరాయిడ్ కారణంగా ఆమె ఆతరువాతి కాలంలో చాలా లావుగా మారిపోయారు. వాణిశ్రీకి ఒక కొడుకు, ఒక కూతురు. ఇక ప్రాపర్టీ గొడవల్లో ఆమె చాలా ఏళ్లపాటు కోర్టుచుట్టూ తిరగాల్సివచ్చింది. తన చెల్లి, బావమరిదితో నెలకొన్న ఆస్తి తగాదాలతో ఆమె చాలా టెన్షన్ లైఫ్ గడపాల్సివచ్చింది. సినిమాల్లో బిజీగా ఉన్న వాణిశ్రీ అకౌంట్లు, సంపాదన అంతా వారే చూసేవారు. దీంతో ఆమె పెద్దగా ఫైనాన్షియల్ విషయాలు పట్టించుకోలేదు. అయినవారి చేతుల్లో తన సంపాదన అంతా సేఫ్ గా ఉందనే అమాయకమైన ఇంప్రెషన్. ఆతరువాతి రోజుల్లో వాణిశ్రీ కొంపముంచాయి. దీంతో 12 ఏళ్లపాటు కోర్టులో న్యాయపోరాటం చేసిన వాణిశ్రీ చివరికి కాంప్రమైజ్ అవ్వటంతో ఈ తగాదాకు ముగింపు పడింది.

సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ స్టార్డం

అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమాతో మళ్లీ ఫిలిం ఇండస్ట్రీలో సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన వాణిశ్రీ పొగురైన అత్తకు కేరాఫ్ గా మారారు. సినిమాల్లోకి తన పిల్లలు రాకుండా వారిని ఇండస్ట్రీకి దూరంగా పెడుతూనే ఇలాంటి సపోర్టింగ్ రోల్స్ చాలా చేశారు వాణిశ్రీ. తన పిల్లలు ఇద్దరినీ డాక్టర్స్ చేశారు వాణిశ్రీ. కానీ దురదృష్టవశాత్తూ ఆమె కుమారుడు అభినయ కార్తీక్ 36 ఏళ్లకే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

రాజకీయాల్లో..

వాణిశ్రీ స్టార్ట్ చేసిన ఓ స్కూల్ లో చదువుకున్న 400 మంది స్టూడెంట్స్ ఇప్పుడు ఎన్నో రంగాల్లో సెటిల్ అయ్యారు. వీరిలో చాలామంది డాక్టర్స్, ఇంజినీర్స్ కూడా అయ్యారు. పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఈమె చాలా లో ప్రొఫైల్ లో ఉండేవారు. పబ్లిక్ లైఫ్ అంటే సినిమాలు, రాజకీయాల్లో యాటిట్యూడ్ చూపించిన యాక్ట్రెస్ గా ఆమెకు పేరుంది. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా వాణిశ్రీ చాలా ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమాలు చేశారు. కానీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారిగా పాలిటిక్స్ లో వాణిశ్రీకి పేరు పడిపోయింది. దీంతో ఈమె పాలిటిక్స్ లో ఎక్కువకాలం రాణించలేకపోయారు. ఇప్పటికీ కాంగ్రెస్ నేత సుబ్బరామిరెడ్డి వంటివారి కోసం ఎలక్షన్స్ లో ఈమె క్యాంపెయిన్ చేస్తుంటారు. ఆతరువాత టీవీల్లో కూడా కొన్ని సీరియల్స్ లో యాక్ట్ చేసినా చెన్నైలోనే సెటిల్ అయి, తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దూరంగా ఆమె శాశ్వతంగా ఉండిపోయారు. నేటికీ ఏవైనా సినిమా ఫంక్షన్స్, అవార్డ్ ఫంక్షన్స్ అయితే తప్ప ఆమె ఇటువైపు రారు.
ఆమె ఏం చేసినా స్టైలే
వాణిశ్రీ అంటే స్టైల్ క్వీన్. ఎంతలా అంటే ట్రెండ్ సెట్టర్ అయ్యేంత. వాణిశ్రీ కొప్పు మీకు తెలుసా? తెలియకపోతే మీ అమ్మ, అమ్మమ్మను అడగండి. వాళ్లు కళ్లు ఇంతలా చేసుకుని మీకు తమ గతాన్ని ఆనందంగా చెబుతారు. వాణిశ్రీ పర్సులు, వాణిశ్రీ చీరలు వాణిశ్రీ స్టిక్కర్స్, వాణిశ్రీ లిప్ స్టిక్స్.. వామ్మో.. ఇలా ఎన్నో స్టైల్స్ ను ఆమె అప్పట్లో సెట్ చేశారు. వాణిశ్రీ ఫ్యాన్స్ అంతా ఆమె ఫ్యాషన్స్ ను ఎప్పటికప్పుడు ఫాలో అయ్యేవారు.

తెలుగు తెరను ఏలిన తార

వెంపటి చినసత్యం స్టూడెంట్ గా ఆమె డ్యాన్స్ నేర్చుకున్నారు. కానీ యాక్టింగ్ అంటే ఇష్టం అందుకే చదువుకుంటూనే డ్రామాలు వేశారు. మరపురాని కథ సినిమాలో సావిత్రి యాక్ట్ చేయాల్సి ఉంది. కానీ అప్పటికే సావిత్రి క్యారియింగ్. సో డెలివరీ అయ్యేవరకు సావిత్రి మరపురాని కథలో యాక్ట్ చేసే ఛాన్స్ లేదు. కానీ సావిత్రిలా కనిపించే వాణిశ్రీకి ఛాన్స్ వచ్చింది. ఇదంతా కోయిన్సిడెన్స్ గా జరిగినా ఆతరువాత కొన్నేళ్లపాటు వాణిశ్రీ తెలుగు తెరను ఏలుతూ తెలుగువారి గుండెల్లో మహారాణిగా స్థానాన్ని పదిలం చేసుకున్నారు. వాణిశ్రీ గురించిన ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఆమె వీణ కూడా వాయించగలరు, నేర్చుకున్నారు కూడా. సెకెండ్ ఇన్నింగ్స్ లో శోభన్ బాబుతో కలిసి ఏమండీ ఆవిడ వచ్చింది సినిమా పెద్ద హిట్ అయింది. సో వాణిశ్రీ ఇమేజ్ ఏంటో చెప్పాలంటే ఈ సినిమా ఒక్కటి చాలు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News