Sunday, November 16, 2025
Homeనేరాలు-ఘోరాలుEarthquake: అండమాన్‌లో భూకంపం.. తీర ప్రాంతంలో ప్రకంపనలు..!

Earthquake: అండమాన్‌లో భూకంపం.. తీర ప్రాంతంలో ప్రకంపనలు..!

Andaman Earthquake: అండమాన్ నికోబార్ దీవులలో భూకంపం సంభవించింది. నేడు సాయంత్రం పోర్టు బ్లెయిర్ లోని సమీప ప్రాంతంలో.. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.5గా నమోదైనట్లు భూకంప శాస్త్ర విభాగం తెలిపింది. భూకంప కేంద్రం అండమాన్ సముద్రంలో, పోర్ట్ బ్లెయిర్‌కు ఆగ్నేయ దిశలో ఉందని గుర్తించినట్లు సమాచారం. భూకంపం.. దాదాపు 10 కిలోమీటర్ల లోతులో సంభవించినట్లు తెలుస్తోంది. సాయంత్రం 5:20 గంటల ప్రాంతంలో భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు.

- Advertisement -

ఈ ప్రకంపనలు పోర్ట్ బ్లెయిర్‌తో పాటు తీర ప్రాంతాల్లోని పలు గ్రామాల్లో కూడా అనుభవించినట్లు సమాచారం. ప్రస్తుతానికి ఈ భూకంపం వల్ల ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు నివేదికలు లేవు. స్థానిక అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. భూకంప తీవ్రత మధ్యస్థంగా ఉండటంతో పెద్దగా నష్టం జరిగే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు. సునామీ హెచ్చరికలు కూడా జారీ చేయబడలేదు.

అసలీ భూకంపాలు ఎందుకు వస్తాయి?

భూమి ఉపరితలం అనేక టెక్టోనిక్ ప్లేట్లతో కూడి ఉంటుంది. ఈ ప్లేట్లు నిరంతరం కదులుతూ ఉంటాయి. ఈ ప్లేట్లు ఒకదానితో ఒకటి ఢీకొన్నప్పుడు, రాసుకున్నప్పుడు లేదా దూరంగా జరిగేటప్పుడు భూకంపాలు సంభవిస్తాయి. అండమాన్ నికోబార్ దీవులు భూకంపాలకు గురయ్యే ప్రాంతంలో ఉన్నాయి, ఎందుకంటే ఇవి రెండు ప్రధాన టెక్టోనిక్ ప్లేట్ల సరిహద్దుల్లో ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతంలో తరచుగా స్వల్ప మరియు మధ్యస్థ తీవ్రత గల భూకంపాలు నమోదవుతూ ఉంటాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad