హైదరాబాద్ లో కారు బీభత్సం సృష్టించింది. వాహనాలు తనిఖీ చేస్తున్న ట్రాఫిక్ పోలీసుల (Traffic Police) నుంచి తప్పించుకునే ప్రయత్నంలో డ్రైవర్ చేసిన పని కలకలం రేపుతోంది. విధుల్లో భాగంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ పోలీసులు తరచూ తనిఖీలు నిర్వహిస్తుంటారు. రూల్స్ పాటించని వాహనదారులు కూడా వారి నుంచి తప్పించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. ఆ సమయంలో వాహనదారులు చేసే స్టంట్స్ కొన్ని ఫన్నీగా ఉంటే… కొన్ని ప్రాణాల మీదకి తెస్తుంటాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే పంజాగుట్ట నాగార్జున సర్కిల్ వద్ద చోటు చేసుకుంది.
Also Read : కేక్ కట్ చేయిస్తా అంటూ రేవంత్ కి కేటీఆర్ విషెస్
నాగార్జున సర్కిల్ వద్ద ట్రాఫిక్ పోలీసులు (Traffic Police) కార్లకు బ్లాక్ ఫిల్మ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఓ కారును ఆపేందుకు ట్రాఫిక్ హోంగార్డు రమేష్ ప్రయత్నించాడు. డ్రైవర్ సయ్యద్ కారు ఆపకుండా దూసుకెళ్లాడు. ఆ కారును ఆపేందుకు హోంగార్డ్ కారు ముందుకి వెళ్లగా… డ్రైవర్ కారు ఆపకుండా హోంగార్డును ఈడ్చుకుంటూ ముందుకు వెళ్ళాడు. ఈ ఘటన స్థానికంగా టెన్షన్ వాతావరణం క్రియేట్ చేసింది. ఈ ఘటనపై పంజాగుట్ట ట్రాఫిక్ ఎస్సై ఆంజనేయులు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.