బఠిండాలోని మిలిటరీ స్టేషన్లో సైనికుల ఆఫీసర్స్ మెస్ లో ఉన్నట్టుండి కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు మృతిచెందగా మరికొందరు గాయపడ్డారు. సామాన్యుల్లా వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఈ కాల్పులకు తెగబడినట్టు తెలుస్తోంది. సరిగ్గా రెండు రోజుల క్రితం సైనిక స్థావరంలో రైఫిల్, తూటాలు మిస్ అయ్యాయి. ఈ నేపథ్యంలో వాటితోనే కాల్పులు జరిగి ఉండచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాల్పులు జరగ్గానే ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దుండగుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Chandigarh: బఠిండా మిలిటరీ స్టేషన్లో కాల్పులు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES