పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను దొంగతనం చేస్తున్న వ్యక్తిని చేవెళ్ళ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుని వద్ద వివిధ కంపెనీలకు చెందిన 9 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక ఎస్సై ప్రదీప్ తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరు గ్రామానికి చెందిన గూడూరు రాజు తండ్రి భీమయ్య వయసు 34 సంవత్సరాలు వృత్తి డ్రైవర్. మద్యానికి బానిసై ఈజీ మనికి అలవాటై బైక్స్ దొంగలించడం ప్రారంభించాడు. చేవెళ్ల పట్టణం చుట్టుపక్కల గ్రామాలలో రోడ్డుపై పార్క్ చేసిన బైక్స్ ప్లగ్ వైర్ కట్ చేసి బైక్స్ స్టార్ట్ చేసుకొని తన తండ్రి పనిచేసే దేవుని ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో తన సొంత గ్రామమైన చేగురూలో ఎవరికి అనుమానం రాకుండా దాచి పెట్టేవాడు. శుక్రవారం డిసెంబర్ 8న ఉదయం 8 గంటలకు తను దొంగిలించిన బైక్ పై వెళ్తుండగా చేవెళ్ల పోలీసు సిసిఎస్ రాజేంద్రనగర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ లో చాకచక్యంగా రాజును పట్టుకొని అతని వద్ద వివిధ కంపెనీలకు చెందిన 9 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. చేవెళ్ళ పోలీసులు నిందితుడు రాజుపై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ… వాహనాలను సురక్షితమైన ప్రాంతంలో పార్క్ చేసుకొని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని వాహనదారులకు సూచించారు.
Chevella: బైక్స్ దొంగతనం చేసి..ఫార్మ్ హౌస్ లో..
నిందితుని వద్ద 9 బైకుల స్వాధీనం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES