Friday, September 20, 2024
Homeనేరాలు-ఘోరాలుGarla: సైబర్ నేరగాళ్ల నుండి డబ్బు రికవరీ

Garla: సైబర్ నేరగాళ్ల నుండి డబ్బు రికవరీ

సైబర్‌ నేరగాళ్ల చేతిలో మోసపోతే 1930కి కాల్ చేయండి

అత్యాశకు పోయి సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి మోసానికి గురి కావద్దని గార్ల బయ్యారం సర్కిల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ అన్నారు. సైబర్ నేరస్తుల చేతిలో మోసపోయిన ఘటనలో నిందితుల నుంచి రికవరీ చేసిన సొమ్మును బాధితునికి సిఐ రవికుమార్ అందజేశారు. వివరాల్లోకి వెళితే గార్ల మండల పరిధిలోని రాజు తండా గ్రామానికి చెందిన నునావత్ రఘురాం 2022 సంవత్సరంలో సైబర్ క్రైమ్ నేరగాళ్ల మాయలో పడి, ఖాతాలోని నగదు పోగొట్టుకోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, విచారణ జరిపి సైబర్ క్రైమ్ నిందితుల నుంచి రికవరీ చేసిన సొమ్మును బయ్యారం సర్కిల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ బాధితునికి 48,429 రూపాయల చెక్కును అందజేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సైబర్ నేరస్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అత్యాశతో వ్యక్తిగత బ్యాంకు సమాచారం వారికి ఇస్తే ఖాతాల్లో ఉన్న నగదు దోచేస్తారని..పార్టుటైమ్‌ జాబ్‌లు, స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌, కొరియర్‌ బిల్లుల పేరుతో ఎవరు ఫోన్‌ చేసినా నమ్మవద్దని, భయపడకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఒక వేళ సైబర్‌ నేరగాళ్ల చేతిలో మోసపోతే వెంటనే 1930కి ఫోన్‌ చేయాలన్నారు. ఘటన జరిగిన రెండు గంటల్లోపు cybercrime.gov.inలో ఫిర్యాదు చేస్తే మీ డబ్బు ఫ్రీజ్‌ అయ్యే అవకాశం ఉంటుందని అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News