దళిత బంధు దళితులకే ఇవ్వరా బీఆర్ఎస్ నాయకులకే ఇస్తారా అని కొల్చారం మండలం కిష్టాపూర్ గ్రామం దళితులు ఏగొండ కిష్టమ్మను ప్రశ్నించారు. కొల్చారం ఎంపీడీవో కార్యాలయం సూపర్ ఇండక్ట్ విట్టల్ నాయక్ కు కిష్టాపూర్ దళిత బంధు పథకంలో అవకతవకలు జరిగాయని విట్టల్ నాయక్ కు వితి పత్రాన్నిఅందజేశారు. కిష్టాపురం గ్రామ సర్పంచ్ దళితులను అవమానిస్తున్నారన్నారు. దళిత బంధు పథకం దళితులకు కాదా బీఆర్ఎస్ నేతలకేనా అంటూ ప్రశ్నించారు. దళిత బంధు మీకు ఇవ్వం మీరు మా కార్యకర్తలు కారు, మా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఇస్తాం మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీ ఓట్లు మాకు వేయరు, మీరు మనుషులు కారని సర్పంచ్ కించపరిచారు. ఈ కార్యక్రమంలో గుండా శ్రీనివాస్ నర్సింలు రోశయ్య శ్రవణ్ నాగరాజు షేకులు కిష్టమ్మ బాలమణి నరసమ్మ లక్ష్మీ జీవన్ భూమయ్య తదితరులు పాల్గొన్నారు.
Kolcharam: దళిత బంధు ఇవ్వ, ఏం చేస్తారు?
మా పార్టీ వాళ్లకే దళితబంధు మీకియ్య
సంబంధిత వార్తలు | RELATED ARTICLES