Friday, November 22, 2024
Homeనేరాలు-ఘోరాలుKonaraopeta: మిర్చి బజ్జిలలో గంజాయి, రిమాండ్ లో ఇద్దరు

Konaraopeta: మిర్చి బజ్జిలలో గంజాయి, రిమాండ్ లో ఇద్దరు

మిర్చీ, బజ్జీలలో గంజాయి వాడుతూ వినియోగదారులను వ్యాసనానికి గురిచేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ కిరణ్ కుమార్ తెలిపారు. ఉపాధి నిమిత్తం ఉత్తరప్రదేశ్ నుండి రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామానికి వచ్చిన రిజ్వాన్ అనే వ్యక్తి తన బజ్జీలు, మిర్చిలలో గంజాయి కలిపి అమ్ముతున్నాడని సమాచారం మేరకు ఎస్ ఐరమాకాంత్ తమ సిబ్బందితో నిజామాబాద్ గ్రామంలోని రిజ్వాన్ ఇంటి వద్దకు వెళ్ళి తనికి చేయగా ఒక గంజాయి ప్యాకెట్ లభించగా, ఆతనిని అట్టి ప్యాకెట్ విషయమై విచారించగా తన ఇంటి ముందు గల విజయ్ అనే అతను తన ఇంటి ముందు పెరడులో గంజాయి మొక్కలను పెంచుతున్నాడని, ఆ ఆకులను విజయ్ వద్ద కొని, వాటిని ఎండబెట్టి బజ్జీ, మిర్చులలో కలిపి ప్రజలను వాటిని తినడానికి వ్యసనానికి గురిచేస్తున్నట్టు వెల్లడించాడు. కోనరావుపేట తహశీల్దార్ రవికాంత్ కు సమాచారం అందగా, తహశీల్దార్ రవికాంత్ సమక్షంలో పంచనామా నిర్వహించి రిజ్వాన్ వద్ద నుండి గంజాయి ప్యాకెట్ ను స్వాధీనం చేసుకొన్నారు. గంజాయి మొక్కలను పెంచుతున్న విజయ్ ను విచారించగా, అతను ఉత్తరాప్రదేశ్ రాష్ట్ర నివాసుడని ఉపాధి నిమిత్తం ఇక్కడే ఉంటున్నాడని తనకు గంజాయి తాగే అలవాటు ఉన్నందున తన ఇంటికి వెళ్ళిన క్రమంలో గంజాయి తీసుకు వచ్చినప్పుడు ఆ గింజలను కిరాయికి ఉంటున్న ఇంటి ముందు పెరడులో చల్లి వాటిని పెంచుతున్నట్టు తేలింది. దానిని విజయ్ తాగడానికి అదే ఇంటి ముందు గల బజ్జీ, మిర్చి అమ్మే రీజ్వాన్ కి అతని వ్యాపార నిమిత్తం అమ్ముతున్ననాని ఒప్పుకొని తన పెరట్లో ఉన్న గంజాయి చెట్లు ఇవే అని చూపించగా వాటిని తహశీల్దార్ సమక్షంలో సీజ్ చేసి తుకం వేయించగా 2.5 కేజీల గంజాయి లభించడం విశేషం. ఆనంతరం విజయ్ మరియు రిజ్వాన్ లను పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి కేసు నమోదు చేసి రిమాండ్ కి పంపించారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ASI శ్రీనివాస్ రెడ్డి, కానిస్టేబుల్స్ దండి నరేశ్, జగన్, సత్యం నాగరాజులను సీఐ అభినందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News