Sunday, November 16, 2025
Homeనేరాలు-ఘోరాలుSuicide in college: తెలంగాణ రెసిడెన్షియల్ కళాశాలలో మరో విద్యార్థి ఆత్మహత్య..!

Suicide in college: తెలంగాణ రెసిడెన్షియల్ కళాశాలలో మరో విద్యార్థి ఆత్మహత్య..!

Student Suicide: తెలంగాణలోని గురుకుల విద్యాలయాల్లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా, నిజామాబాద్ జిల్లాలోని వేల్పూర్ సోషల్ వెల్ఫేర్ బాయ్స్ రెసిడెన్షియల్ కాలేజీలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్న ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.

- Advertisement -

ఘటన వివరాల్లోకి వెళ్తే, బైపీసీ విద్యార్థి గడ్డం సంతోష్ (16) శనివారం ఉదయం కళాశాల ప్రాంగణంలోని ఒక చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. సంతోష్ కామారెడ్డి జిల్లా, నిజాంసాగర్ మండలం, అరెపల్లి గ్రామానికి చెందినవాడు. అతను వేల్పూర్ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల కళాశాలలో బైపీసీ మొదటి సంవత్సరంలో చేరాడు. వేల్పూర్ మండల కేంద్రంలో స్థల సమస్య కారణంగా ఈ కళాశాలను ప్రస్తుతం ఆర్మూర్‌లోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల కళాశాలలోనే నిర్వహిస్తున్నారు. సంతోష్ అక్కడే బైపీసీ మొదటి సంవత్సరం పూర్తి చేసుకొని, ప్రస్తుతం రెండో సంవత్సరం చదువుతున్నాడు.

శనివారం ఉదయం ఆరున్నర గంటల వరకు సంతోష్ కళాశాల గ్రౌండ్‌లో వాకింగ్, రన్నింగ్, ఎక్సర్సైజ్ చేశాడు. ఆ తర్వాత ఫ్రెషప్ అవ్వడానికి తన గదిలోకి తిరిగి వెళ్లాడు. అక్కడి నుండి ఒక టవల్ తీసుకొని, హాస్టల్ వెనుక వైపు ఉన్న కాంపౌండ్ వాల్ దూకి బయటకు వెళ్ళినట్లు సమాచారం. అతను హాస్టల్‌కు తిరిగి రాకపోవడంతో, అతని స్నేహితులు వెతకడం ప్రారంభించారు. చివరకు, కళాశాల ఆవరణ వెలుపల ఉన్న చెట్టుకు ఉరివేసుకుని కనిపించాడు. సమీపంలో ఉన్న ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు గమనించి సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కళాశాల యాజమాన్యం వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

స్నేహితులు, కుటుంబ సభ్యులు మరియు కళాశాల సిబ్బందిని విచారించి, అతని ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా వంటి సాంకేతిక ఆధారాలను కూడా పరిశీలించవచ్చు. గురుకుల విద్యాలయాల్లో పెరుగుతున్న ఆత్మహత్యలు విద్యార్థుల మానసిక ఆరోగ్యం, వారిపై ఉన్న ఒత్తిడిని తగ్గించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad