హైదరాబాద్ లో అడిక్‌మెట్ బ్రిడ్జిపై జరిగిన రోడ్డు ప్రమాదం(Road Accident)లో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతిచెందారు. సమాచారం ప్రకారం, వేగంగా వెళ్తున్న బైక్ స్కిడ్ కావడంతో విద్యార్థులు అదుపు తప్పి కింద పడిపోయారు.
- Advertisement -
ఈ ప్రమాదానికి అధిక వేగమే కారణంగా భావిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే స్థానికులు అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అయితే, తీవ్ర గాయాలు కారణంగా ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.
మృతదేహాలను గాంధీ హాస్పిటల్‌కు తరలించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తిస్థాయిలో విచారణ అనంతరం ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు వెల్లడికానున్నాయి.