Saturday, November 23, 2024
HomeదైవంSrisailam: శ్రీశైలంలో భక్తుల రద్దీ

Srisailam: శ్రీశైలంలో భక్తుల రద్దీ

సోమవారం అమావాస్య కావటంతో విపరీతంగా పెరిగిన భక్తుల తాకిడి

శ్రీశైలంలో ముక్కంటి ఆలయానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. అమావాస్య సోమవారం కావడంతో క్షేత్రంలో భక్తులు రద్దీ అనూహ్యంగా భారీగా పెరిగింది క్షేత్రమంత భక్తజనంతో సందడి వాతావరణం నెలకొంది భక్తులు వేకువజామున నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూలైన్స్ లో దర్శన కంపార్టుమెంట్లలో బారులు తీరారు శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతుంది మరోపక్క భక్తులు స్వామి అమ్మవారి రుద్రాభిషేకం, కుంకుమార్చన తదితర అభిషేకార్చనలు నిర్వహించి మొక్కులు తీర్చుకుంటున్నారు.

- Advertisement -

అయితే భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ ఈవో లవన్న ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు దర్శనార్థమై క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం,పాలు,బిస్కెట్స్ మంచినీరు అందించారు,

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News