Friday, November 22, 2024
HomeదైవంAhobilam: వైకుంఠ ఏకాదశికి అహోబిలేసుని దర్శనానికి పోటెత్తిన భక్తులు

Ahobilam: వైకుంఠ ఏకాదశికి అహోబిలేసుని దర్శనానికి పోటెత్తిన భక్తులు

లక్ష్మి నరసింహుని ఆశీర్వాదం కోసం తపించిన భక్త జనం

ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ముక్కోటి ఏకాదశి పర్వదినం రోజున ఏడాదికొక పర్యాయం తెరిచే వైకుంఠ ఉత్తర ద్వారాలను తెరిచి వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎగువ దిగువ అహోబిలం క్షేత్రాలలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వైకుంఠ ఉత్తర ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేశారు. నల్లమల కొండలలో వణికిస్తున్న చలిని కూడా లెక్కచేయకుండా తెల్లవారుజామున మూడు గంటల నుండి భక్తులు క్యూ లైన్ లలో బారులు తీరి తమ ఆరాధ్య దైవమైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని, శ్రీదేవి భూదేవి అమ్మవార్లను కనులారా దర్శించుకొని పెద్ద ఎత్తున గోవింద నామస్మరణలు చేశారు.వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని దేవస్థానం వారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా దేవస్థానం వారు అన్ని ఏర్పాట్లు చేయడంతో భక్తులు ప్రశాంత వాతావరణంలో శ్రీవారిని దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని శ్రీ ప్రహ్లాద వరద స్వామి శ్రీదేవి భూదేవి అమ్మవార్లను స్వర్ణాభరణాలు పూలమాలలతో విశేషంగా అలంకరించి ఆలయ ప్రధానా ర్చకులు కీడాంబి వేణుగోపాల్ స్వామి విశేష పూజలు నిర్వహించారు. అహోబిలేశుని దర్శించుకున్న 46వ పీఠాధిపతి.. అహోబిలం మఠం 46వ పీఠాధిపతి శ్రీ వన్ శఠగోప శ్రీ రంగనాథ యతేంద్ర మహాదేసుకుని స్వామి వారు ప్రప్రధమంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వేద పండితులు శ్రీవారి శేష వస్త్రంతో ఆయనను ఘనంగా సత్కరించారు. మాజీ ఎంపీ పూజలు.. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నంద్యాల మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ గంధం రాఘవరెడ్డి తదితర ప్రముఖులు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వైస్ ప్రెసిడెంట్ నాసారి లక్ష్మీప్రసాద్ కేడీసీసీ బ్యాంకు డైరెక్టర్ నాశారి వెంకటేశ్వర్లు , అమర్నాద్ రెడ్డి పలువురు వైసిపి నాయకులు కూడా పాల్గొన్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని అహోబిలం పుణ్యక్షేత్రంలో సాయంత్రం ప్రహ్లాద వరద స్వామివారిని గరుడ వాహనంపై అలంకరించి మాడవీధులలో ఊరేగింపు నిర్వహించారు శ్రీమహావిష్ణువునకు ఎంతో ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై స్వర్ణ దివ్యభరణాలతో స్వామివారిని అలంకరించి మేళతాళాలతో వేద మంత్రాలు నమా పెద్ద ఎత్తున ఊరేగింపు ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ ఉత్సవానికి భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి గోవింద నామస్మరణ చేశారు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా డి.ఎస్.పి. బి వెంకటరామయ్య ఆదేశాల మేరకు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News