శ్రీ అహోబిల లక్ష్మీ నరసింహ స్వామి మహాక్షేత్రంలో వరలక్ష్మి వ్రతం సందర్భంగా శుక్రవారం ఉదయం ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాలన్ ఆధ్వర్యంలో వేద పండితులు కలసి ప్రత్యేక పూజలు చేసి శ్రీ అమృతవల్లి అమ్మవారికి నవ కలశ పూర్వక పంచామృతాభిషేకం నిర్వహించారు. సాయంత్రం అమ్మవారికి ఆలయ ప్రాకారంలో ఉత్సవం నిర్వహించి అనంతరం రంగ మంటపంలో ఊంజల్ సేవ నిర్వహించి భక్తులకు అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. ఈకార్యక్రమంలో ఆలయం మఠం ప్రతినిధి సంపత్ పాల్గొన్నారు. శ్రీ అహోబిల మఠం పీఠాధిపతి వారు భక్తులకు చీర, రవిక, కుంకుమ అందజేసి ఆశీర్వదించారు. అనంతాచారి, సురేఖ దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీ అహోబిల మఠం ఆస్థాన విద్వాన్ యాలురి శీను, శ్రీ కాళహస్తి దుర్గాప్రసాద్ బృందం వాద్యకచేరి నిర్వహించి అలౌకిక ఆనందాన్ని కలిగించారు.