Sunday, July 7, 2024
HomeదైవంBanaganapalli: ముగిసిన బ్రహ్మంగారి ఆరాధనోత్సవాలు

Banaganapalli: ముగిసిన బ్రహ్మంగారి ఆరాధనోత్సవాలు

మహా నివేదనతో ..

బనగానపల్లె పట్టణంలో ఈనెల 17వ తేదీ నుండి ప్రారంభమైన జగద్గురు శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి 331వ ఆరాధన మహోత్సవాలు ఆదివారం మహా నివేదన కార్యక్రమంతో ముగిసాయి. బ్రహ్మంగారు నడయాడి కాలజ్ఞానం రచించిన ప్రాంతం కావడంతో పట్టణంలోని అచ్చమాంబ చింతమాను మఠం, వీరప్పయ్య ఆశ్రమం, నేలమఠంను ఇతర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు సందర్శించారు.

- Advertisement -

శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆయా మఠాల వద్ద భక్తుల కొరకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆరాధనోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి 7 గంటలకు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఉత్సవ విగ్రహాలను పట్టణంలో గ్రామోత్సవం నిర్వహించారు. ఆదివారం మహా నివేదన కార్యక్రమంతో ఆరాధన మహోత్సవాలు ముగిశాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News