Monday, November 17, 2025
HomeదైవంHindu Mythology: పాముల్లో ఏది అత్యంత శక్తివంతమైనది.. శేష నాగ, వాసుకి, తక్షకుడా?

Hindu Mythology: పాముల్లో ఏది అత్యంత శక్తివంతమైనది.. శేష నాగ, వాసుకి, తక్షకుడా?

Hindu Mythology in Telugu: హిందువులు పాములకు దైవత్వం ఉందని భావిస్తారు. అందుకే ప్రతి ఏటా నాగపంచమి, నాగుల చవితి పండుగల నాడు నాగదేవతను పూజిస్తారు. పురాణాల ప్రకారం, పాతాళ లోకం నాగులకు నివాసంగా ప్రజలు నమ్ముతారు. మత గ్రంథాల ప్రకారం, ఎనిమిది నాగులు శక్తివంతమైనవిగా భావిస్తారు. అవే శేషనాగు, వాసుకి, తక్షక, కర్కోటక, కాళియుడు, పద్మ, మహాపద్మ, శంఖ. అయితే ఈ 8 సర్పాల్లో మిక్కిలి ప్రసిద్ధమైనవి, మూడే. అవే శేషుడు, వాసుకి, తక్షకుడు. అయితే వీరిలో ఏ పాము శక్తివంతమైనదో తెలుసుకుందాం.

- Advertisement -

శేష నాగు
పాములందరికీ కశ్యపుడు, కద్రువలే తల్లిదండ్రులు. వీరి యెుక్క పెద్ద కుమారుడే ఆదిశేషుడు. ఇతడినే అనంతుడు అని కూడా పిలుస్తారు. అంటే అంతం లేనివాడు అని అర్థం. ఇతడు శ్రీమహావిష్ణువుకు తల్పంగా మారి సేవలందిస్తున్నాడు. శేషనాగు వెయ్యి పడగలు కలిగి ఉంటాడు. పైగా తన తలపై ఈ భూ భారాన్ని మోస్తాన్నాడని హిందువులు నమ్ముతారు. అయితే శ్రీహరి శ్రీరాముడిగా అవతారం దాల్చినప్పుడు..ఆది శేషుడు లక్ష్మణుడిగా, శ్రీకృష్ణుడిగా అవతారం ఎత్తినప్పుడు శేషుడు బలరాముడిగా అవతరించాడు. విశ్వ సమతుల్యతకు ఆదిశేషుడిని చిహ్నంగా భావిస్తారు.

వాసుకి
వాసుకిని సర్పాలకు రాజుగా పిలుస్తారు. అంతేకాదు, సృష్టి లయకారుడైన పరమేశ్వరుడు మెడలో అభరణంగా వాసుకి ఉంటాడు. పైగా వాసుకి అనంతడుకి తమ్ముడు. ఇతడు వంద పడగలను కలిగి ఉంటాడు. సముద్ర మథనంలో వాసుకి తాడుగా మారి దేవతలకు, రాక్షసులకు అమృతాన్ని అందించడంలో ప్రధాన పాత్ర పోషించింది. వాసుకిని త్యాగానికి గుర్తుగా పరిగణిస్తారు.

Also Read: Sravanamasam – శ్రావణ మాసంలో ఈ పరిహారాలు చేశారంటే..మీ అప్పుల బాధలన్నీ తీరిపోతాయంతే..!

తక్షకుడు
పాములన్నింటిలో ప్రమాదకరమైనది, దుష్ట స్వభావం గలవాడు తక్షకుడు. ఇతడి ప్రస్తావన మహాభారతంలో ఉంటుంది. దేవేంద్రుడికి తక్షకుడు మంచి మిత్రుడు. పైగా అర్జునుడు మనవుడైన పరీక్షిత్ ను ఇతడే కాటు వేసి చంపుతాడు.

హిందూ పురాణాలు ప్రకారం, ఆదిశేషుడు, వాసుకి, తక్షకుడులో ఎవరు శక్తిమంతుడూ చెప్పాలంటే ఖచ్చితంగా శేష నాగునే చెప్పవచ్చు.

Also Read: August 2025 Festivals – ఆగస్టులో రాబోతున్న పండుగలు, వ్రతాలు ఏంటో తెలుసా?

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad