కరీంనగర్ జిల్లాలోనే అపర భద్రాద్రిగా పేరొందిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో సోమవారం శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణాన్ని వేద పండితులు వైభవోపేతంగా జరిపించారు. ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ మండపంలో స్వామివారిని సుగంధ పరిమళ పుష్పాలంకరణతో అలంకరింపజేశారు. మంగళ వాయిద్యాలు వేదమంత్రోచ్ఛరణల మధ్య ఆలయ ప్రధాన అర్చకులు శేషం రామాచార్యులు, శేషం వంశీధరా చార్యులు, వేద పండితులు శేషం సీతారామచార్యుల ఆధ్వర్యంలో శ్రీ గోదా రంగనాథ స్వామి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు.
స్వామివారి కల్యాణానికి హాజరైన భక్తులకు ఆలయ ఈవో కందుల సుధాకర్ ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉద్యోగులు మోహన్, రమేష్, ప్రవీణ్ తోపాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.