Sunday, October 6, 2024
HomeదైవంMahanandi: మహానందిలో వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం

Mahanandi: మహానందిలో వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం

అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో..

మహానంది క్షేత్రంలో అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ట సందర్భంగా లోక కల్యాణం కోసం వైభవంగా శ్రీ సీతారాముల వారి కళ్యాణోత్సవం నిర్వహించారు. మహానంది క్షేత్రంలో ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ సీతా సమేత కోదండ రామలక్ష్మణ మూలవరులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కళ్యాణ వేడుకలలో శ్రీ సీతారాముల ఉత్సవ మూర్తులను కొలువుంచి, వివిధ రకాల పుష్పాలతో విశేషంగా అలంకరించారు. అనంతరం వేద పండితులు రవిశంకర్ అవధాని, నాగేశ్వర్ శర్మ, శాంతారాం భట్, ఆలయ ప్రధాన అర్చకులు మామిళ్ళపల్లి అర్జున్ శర్మ మరియు అర్చక బృందం గణపతి పూజా, పుణ్యాహవాచనం, మాంగళ్య ధారణ క్రత్రువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు.

- Advertisement -

భక్తులు అయోధ్య నుంచి వచ్చిన శ్రీరాముని అక్షింతలు తలపై చల్లుకొని పునీతులయ్యారు. అయోధ్య రామ మందిరం నిర్మాణంలో కరసేవలో పాల్గొన్న మహానంది మండలంకు చెందిన వెంకట శివయ్య, భూమా స్వామి గుప్తా, భూమా గోపాలకృష్ణ, శివరామిరెడ్డిలను ప్రజలు పౌర సత్కారం చేయగా, దేవస్థానం తరపున ఈవో చంద్రశేఖర్ రెడ్డి, స్వామివారి శేషవస్త్రంతో సత్కరించగా, వేద పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం భక్తులకు వడపప్పు పానకం, ప్రసాదాలు పంపిణీ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణాన్ని వీక్షించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ మధు, ధర్మకర్తలు గంగిశెట్టి మల్లికార్జున రావు అమృత దంపతులు, బండి హేమలత, బసిరెడ్డి రామ తులసమ్మ, వీరభద్రుడు, ఎస్ఎస్ఎఫ్ మహిళా మండలి సహా కన్వీనర్ మునుగురు శ్రీలక్ష్మీ, ఆర్యవైశ్య మహిళా మండలి సభ్యులు, దేవస్థానం అధికారులు మరియు సిబ్బంది, గ్రామ ప్రజలు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News