Saturday, October 5, 2024
HomeదైవంRudravaram: రుద్రవరంలో ఘనంగా నారసింహుడికి పూజలు

Rudravaram: రుద్రవరంలో ఘనంగా నారసింహుడికి పూజలు

పార్వేట ఉత్సవాలలో భాగంగా..

మండల పరిధిలోని ఆలమూరు గ్రామంలో నారసింహుడికి భక్తులు ఘనంగా పూజలు నిర్వహించారు. అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి పార్వేట ఉత్సవాలలో భాగంగా ఉత్సవమూర్తుల పల్లకి ఆలమూరు గ్రామం చేరుకుంది. మొదటి రోజు గ్రామంలోని ఆయా తెలుపులపై ఉత్సవ మూర్తుల పల్లకి కొలువు దీరగా భక్తులు పూలు కొబ్బరికాయ పూజా సామాగ్రి స్వామివారికి సమర్పించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవ మూర్తులను దర్శించుకున్నారు.

- Advertisement -

గ్రామ సర్పంచ్ పాణ్యం లక్ష్మీదేవి మండల కన్వీనర్ పాణ్యం నాగేష్ వైసీపీ నాయకులు పాణ్యం చంద్రతో పాటు పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు ఉత్సవ మూర్తులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తహసిల్దార్ రవీంద్ర ప్రసాద్ వీఆర్వోలు సచివాలయం సిబ్బంది తదితరులు ఉత్సవ మూర్తులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలోకి పారువేట పల్లకి రాకతో గ్రామంలో కొత్త పాత బంధుమిత్రులతో పండుగ వాతావరణం నెలకొంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News