Sunday, May 12, 2024
HomeదైవంMahanandi: వైభవంగా సీతారాముల కళ్యాణం

Mahanandi: వైభవంగా సీతారాముల కళ్యాణం

ఘనంగా గ్రామోత్సవం

మహానంది పుణ్యక్షేత్రంలో సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీరామ నవమి పండుగ పురస్కరించుకొని క్షేత్రంలో వెలిసిన శ్రీ సీతా లక్ష్మణ హనుమత్సమేత కోదండరాముల స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు.

- Advertisement -

స్వామివార్ల మూల విరాట్లకు విశేషమైన అభిషేకం, పుష్ప పల్లకి, అలంకార పూజలు నిర్వహించారు. అనంతరం సీతారాముల ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా కళ్యాణ మండపంలోకి చేర్చారు. అక్కడ వేదపండితులు, అర్చకులు ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో ఉత్సవ విగ్రహాలను ఆశీనులుగా చేశారు.

అనంతరం ఉత్సవ విగ్రహాలను అలంకరణ చేశారు.మధ్యాహ్నం అభజిత్ లగ్నంలో అర్చకులు, వేద పండితుల వేద మంత్రోచ్ఛారణ మధ్య సీతారాముల కల్యాణం కమనీయంగా సాగింది. ముత్యాల తలంబ్రాలతో పెళ్లి సందడితో భక్తులు మురిసిపోయారు.

అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో కాపు చంద్రశేఖర రెడ్డి,సుధాకుమారి దంపతులతో పాటు దాతలు అవ్వారు గౌరీనాథ్, సరస్వతి దంపతులు, ఏఈఓ లు మధు, ఓ.వెంకటేశ్వర్లు, టెంపుల్ ఇన్స్పెక్టర్ లు ఆర్ ఎస్ శ్రీనివాసులు, శశిధర్ రెడ్డి, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

మహానందిలో కన్నుల పండుగగా సీతారాముల గ్రామోత్సవం నిర్వహించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News