Sunday, May 12, 2024
HomeదైవంMantralayam: మూల రాముడికి మహాభిషేకం

Mantralayam: మూల రాముడికి మహాభిషేకం

ఏడాదికి రెండుసార్లే మహాభిషేకం

శ్రీ రామ నవమి శుభ సందర్భంగా శ్రీ మఠం మంత్రాలయంలోని శ్రీ బ్రహ్మ కరార్చిత శ్రీ మూల రామదేవుడు, ఇతర సంస్థాన విగ్రహాలకు పీఠాధిపతి శ్రీ సబుదేంద్ర తీర్థులు మహా అభిషేకం నిర్వహించారు.

- Advertisement -

మహా అభిషేక కార్యక్రమం అనంతరం పరమ పవిత్రమైన శ్రీ స్వామీజీ శ్రీ మూల రామదేవరు, శ్రీ దిగ్విజయ రామదేవరు మరియు శ్రీ జయరామదేవరులకు గంధాన్ని (గంధ లేపన) పూశారు. తరువాత సంస్థాన పూజను నిర్వహించారు.

మహా అభిషేక అనేది ఒక అరుదైన, ముఖ్యమైన వేడుక, ఇది సంవత్సరానికి రెండుసార్లు మాత్రమే జరుగుతుంది. ఒకసారి శ్రీరామ నవమి సమయంలో మరియు మరొసారి ఈ ప్రత్యేక రోజు, బలి పాడ్యమి నాడు నిర్వహిస్తారు . పెద్ద సంఖ్యలో భక్తులు, ఈ దివ్య కార్యక్రమంలో భాగమయ్యేందుకు తరలివచ్చి ఆశీర్వాదం పొందారు.

మంత్రాలయంలో పలిమారు మఠం విద్యాదీశ తీర్థ స్వామీజీ

రాఘవేంద్రస్వామి దర్శనార్థం పలిమారు మఠం విద్యాదీశ తీర్థ స్వామీజీ , ఉడిపిలోని పలిమారు మఠానికి చెందిన జూనియర్ పీఠాధిపతి శ్రీ విద్యారాజేశ్వర తీర్థ స్వామీజీ మంత్రాలయాన్ని సందర్శించారు. శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ వారికి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.

ఇద్దరు మఠాధిపతులు శ్రీ రాఘవేంద్ర స్వామిగలవారు, శ్రీ వదీంద్ర తీర్థుల దర్శనం చేసుకున్నారు. అనంతరం హెచ్.హెచ్.శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ , హెచ్.హెచ్.శ్రీ విద్యాదీశ తీర్థ స్వామీజీ, శ్రీ విద్యారాజేశ్వర తీర్థ స్వామీజీలను శ్రీ రాయర వస్త్ర, ప్రసాదాలతో సత్కరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News