Mars transit in Scorpio: : జ్యోతిష్యశాస్త్రంలో అంగారకుడి పాత్ర చాలా ముఖ్యమైనదని పండితులు చెప్పారు. ధైర్యం, శౌర్యం, నాయకత్వం, వ్యూహాత్మక ఆలోచనల ప్రతీకగా ఈ గ్రహాన్ని వివరిస్తారు. అక్టోబర్ 27న అంగారకుడు తన స్వరాశి అయిన వృశ్చిక రాశిలో ప్రవేశించబోతున్నాడు. ఈ మార్పుతో రుచక మహారాజయోగం అనే శక్తివంతమైన యోగం ఏర్పడనుంది. ఇది పంచ మహాపురుష యోగాలలో ఒకటిగా పండితులు చెబుతున్నారు. ఈ ప్రత్యేక యోగం ద్వాదశ రాశులలో కొందరికి విశేషమైన ఫలితాలను అందిస్తుంది. కొందరికి ఆర్థికాభివృద్ధి, మరికొందరికి వ్యక్తిగత జీవితంలో సానుకూల మార్పులు కనిపించవచ్చు.
మిథున రాశి..
మిథున రాశి వారికి ఈ అంగారక సంచారం కొత్త ఉత్సాహాన్ని తెస్తుంది. గతంలో ఉన్న ఒత్తిడులు తగ్గి, మానసికంగా తేలిక అనిపిస్తుంది. ఉద్యోగంలో మీ కృషికి గుర్తింపు లభించే అవకాశం ఉంది. మీరు ప్రారంభించే పనులు విజయవంతంగా పూర్తవుతాయి. పెట్టుబడులు పెట్టిన వారు మంచి లాభాలను పొందుతారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. కానీ కోపం లేదా తొందరపాటు నిర్ణయాలను దూరంగా ఉంచడం మంచిది. వైవాహిక జీవితంలో ఆనందం పెరుగుతుంది.
సింహ రాశి..
సింహ రాశి వారికి అంగారకుడి ప్రవేశం ఆర్థిక లాభాలను తెస్తుంది. కొత్త ప్రాజెక్టులు, వ్యాపార విస్తరణలలో అనుకూలత ఉంటుంది. మీ కష్టానికి తగిన ఫలితాలు దక్కుతాయి. నిలిచిపోయిన బకాయిలు తిరిగి రాబడే అవకాశం ఉంది. కుటుంబంలో ఆనందం పెరిగి, సంబంధాలు బలపడతాయి. వ్యాపారస్తులకు ఈ కాలం అత్యంత శుభప్రదంగా మారే అవకాశం ఉంది. కొత్త ఒప్పందాలు లేదా భాగస్వామ్యాలు లాభదాయకంగా ఉంటాయి.
కన్య రాశి..
కన్య రాశి వారికి కుజుడి సంచారం పెద్ద మార్పులను సూచిస్తోంది. కెరీర్‌లో మీ ప్రతిభ గుర్తింపు పొందుతుంది. ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు లభించవచ్చు. ఉద్యోగంలో పదోన్నతి అవకాశాలు కూడా ఉన్నాయ్. నిరుద్యోగులు ఆశించిన అవకాశాలను పొందవచ్చు. వ్యాపార రంగంలో కొత్త అవకాశాలు సృష్టిస్తారు. మీ కుటుంబ సభ్యులతో బంధం మరింత గాఢమవుతుంది. ఆరోగ్యపరంగా సానుకూల మార్పులు కనిపిస్తాయి.
మకర రాశి..
మకర రాశి వారికి అంగారకుడి సంచారం ఆర్థిక ప్రగతికి దారితీయగలదు. మీరు పెట్టుబడి చేసిన చోట నుంచి లాభదాయక ఫలితాలు వస్తాయి. నిలిచిపోయిన డబ్బులు తిరిగి రాబడతాయి. కొందరికి అకస్మాత్తుగా ఆర్థిక లాభం కలగవచ్చు. అయితే ఖర్చులను అదుపులో ఉంచడం అవసరం. వ్యాపారులు కొత్త ఒప్పందాలు, భాగస్వామ్యాల ద్వారా ఆదాయం పెంచుకోగలరు. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. వివాహితుల జీవితంలో పరస్పర అర్థన పెరుగుతుంది.
కుంభ రాశి…
కుంభ రాశి వారికి ఈ కాలం అనేక విధాలుగా శుభప్రదం కానుంది. విద్యార్థులు తమ కృషికి తగ్గ ఫలితాలు సాధిస్తారు. పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. కొత్త ప్రాజెక్టులు లేదా సృజనాత్మక పనులలో విజయాలు దక్కుతాయి. దూరప్రయాణాలు లేదా విదేశీ అవకాశాలు ఎదురుకావచ్చు. మీ సామాజిక గౌరవం పెరుగుతుంది. వ్యాపార రంగంలో లాభాలు గణనీయంగా పెరుగుతాయి. కుటుంబంలో ఆనందభరిత వాతావరణం నెలకొంటుంది.
రుచక మహారాజయోగం ఏర్పడటం ద్వారా ఈ ఐదు రాశుల వారికి శక్తి, ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. కొత్త దిశలో ఆలోచించే తత్వం కలుగుతుంది. ఈ కాలం జీవితంలో కొత్త అవకాశాలను తెరుస్తుంది. కొంత క్రమశిక్షణతో ముందుకు సాగితే అంగారకుడి అనుగ్రహం మరింత ఫలితాలను అందిస్తుంది.


