Mercury Nakshatra Transit 2025: నవగ్రహాల్లో బుధుడికి ప్రత్యేక స్థానం ఉంది. జ్యోతిష్యశాస్త్రంలో ఇతడిని గ్రహాల యువరాజు అని పిలుస్తారు. మెర్క్యూరీని తెలివితేటలు, వ్యాపారం, కమ్యూనికేషన్, స్కిల్స్ కు అధిపతిగా భావిస్తారు. బుధుడు ప్రతి నక్షత్రంలో 15 నుండి 20 రోజులపాటు ఉంటాడు. తాజాగా బుధుడు శనిదేవుడి నక్షత్రమైన పుష్యమి నక్షత్రంలోకి ప్రవేశించాడు. దీని కారణంగా కొన్ని రాశులవారు ఊహించని ప్రయోజనాలను పొందుతారు.
ధనుస్సు రాశి
బుధుడు సంచారం వల్ల ధనస్సు రాశి వారు శుభఫలితాలు పొందుతారు. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే సక్సెస్ సాధిస్తారు. వ్యాపారవేత్తలు అనుకోని లాభాలు ఉంటాయి. వృత్తి పరంగా ఈ సమయం బాగుంటుంది. ఉద్యోగులకు జీతం పెరగడంతోపాటు ఆకస్మికంగా ప్రమోషన్ కూడా వస్తుంది. మీరు ఆర్థికంగా స్థిరపడతారు. ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది.
కన్య రాశి
ఈ సమయం కన్యారాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. మీ జ్ఞానం వృద్ధి చెందుతుంది. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు అమాంతం పెరుగుతాయి. మీకు తోటి ఉద్యోగుల నుండి, మీ బాస్ నుండి ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారంలో ఊహించని లాభాలు ఉంటాయి. కెరీర్ లో కీలక మార్పులు ఉండబోతున్నాయి. సంపద పెరుగుతుంది. మీరు చేపట్టిన పని లేదా ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు.
తులా రాశి
పుష్యమి నక్షత్రంలో బుధుడు సంచారం తులరాశి వారికి అద్భుతంగా ఉండనుంది. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్ అవకాశం ఉంది. మీ కెరీర్ లో మంచి ఎదుగుదల ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ఫ్యామిలీతో మంచి సమయం గడుపుతారు.
Also Read: August 2025 Festivals – ఆగస్టులో రాబోతున్న పండుగలు, వ్రతాలు ఏంటో తెలుసా?
మిథున రాశి
బుధుడు పుష్యమి నక్షత్ర ప్రవేశం మిథునరాశి వారికి చాలా మేలు చేస్తుంది. మీరు ఆర్థికంగా బలమైన స్థితిలో ఉంటారు. మీరు ఎంతోగానే ఎదురుచూసే ప్రమోషన్ రానే వస్తుంది. వివాహాయోగం ఉంది. మీ కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. మీ కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. అనుకోని శుభవార్తలు వింటారు. సాహిత్య రంగానికి సంబంధించిన వారు లాభపడతారు.
Also Read: Solar Eclipse – ఈ శతాబ్దపు అతిపెద్ద సూర్యగ్రహణం ఎప్పుడో తెలుసా?


