Navapanchama Rajayogam on Dasara 2025: వేద జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల సంచారానికి చాలా ప్రాధాన్యత ఉంది. వీటి ప్రభావం మానవ జీవితంపై ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి నెలా కొన్ని కీలక గ్రహ సంచారాలు జరుగుతూ ఉంటాయి. అక్టోబరులో కూడా ప్రధాన గ్రహాలు తమ రాశులను మార్చి అరుదైన యోగాలను సృష్టించబోతున్నాయి. ముఖ్యంగా దసరా రోజున అంటే అక్టోబర్ 02న బుధుడు, గురుడు మరియు శుక్ర గ్రహాల కలయిక వల్ల నవపంచమ రాజయోగం ఏర్పడబోతుంది. ఈ అరుదైన యాదృచ్చికం 62 ఏళ్ల తర్వాత ఏర్పడుతోంది. దీని వల్ల కొందరి జీవితాల్లో వెలుగులు రాబోతున్నాయి. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం.
వృశ్చిక రాశి
నవ పంచమ రాజయోగం వృశ్చిక రాశి వారి అదృష్టాన్ని మార్చబోతుంది. మీ కెరీర్ లో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయి మంచి స్థితికి చేరుకుంటారు. పూర్వీకుల స్థిర చరాస్తులు కలిసి వస్తాయి. రుణ భారం నుండి విముక్తి పొందుతారు. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. జాబ్ చేసేవారికి సడన్ గా శాలరీ పెరగడంతోపాటు ప్రమోషన్ కూడా వస్తుంది. విదేశాలకు విద్య, ఉద్యోగ మరియు వ్యాపార నిమిత్తం వెళ్లాలనుకునేవారికి ఇదే మంచి సమయం. బిజినెస్ చేసే వారు భారీగా లాభాలను ఆర్జిస్తారు.
సింహ రాశి
ఈ రాశి వారికి నవ పంచమ యోగం అదృష్టంతోపాటు ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టనుంది. ఈ సమయంలో మీరు కొన్ని శుభవార్తలు కూడా వింటారు. మీరు చేపట్టిన ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసి ప్రశంసలు అందుకుంటారు. ఇంతకుముందు పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు లాభాలను ఇస్తాయి. మీకు పని చేసే చోట గౌరవం లభిస్తుంది. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. మీ కృషికి తగిన గుర్తింపు ఉంటుంది.
Also Read: Mahanavami 2025 – మహానవమి నాడు అరుదైన యోగాలు…ఈ 3 రాశులకు ఊహించని లాభాలు..
కన్యా రాశి
ఈ రాశి వారికి నవ పంచమ రాజయోగం వల్ల మీ కెరీర్ లో అనుకోని మార్పులు వస్తాయి. మీరు ఎవ్వరూ ఊహించని స్థాయికి ఎదుగుతారు. ఆఫీసులో కొత్త బాధ్యతలు తీసుకుంటారు. వ్యాపారులకు బిజినెస్ ను విస్తరించడానికి ఇదే మంచి సమయం. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. లక్ ఎల్లప్పుడూ మీ వెన్నంటే ఉంటుంది. విద్యార్థులు మంచి మార్కులు తెచ్చుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. సంతానానికి సంబంధించిన గుడ్ న్యూస్ వింటారు.
Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం పాఠకుల ఆసక్తి మేరకు ఇచ్చాం. పండితుల సూచనలు, ఇంటర్నెట్ డేటాను పరిగణనలోకి తీసుకుని ఈ కథనాన్ని రూపొందించాం. దీనికి ఎటువంటి శాస్త్రీయత లేదు. తెలుగు ప్రభ దీనిని ధృవీకరించలేదు.


